సమాజంలో నిర్వహించాల్సిన బాధ్యతలను ఒక మనిషి నిర్వహించకపోతే అతనికి బాధ్యతను గుర్తు చేయాల్సిన బాధ్యత అధికారయంత్రాంగం వహిస్తుంది. మరోనా అలాంటి మహ్మారులు విజృంభిస్తున్నప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కరోనా భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో నిర్లక్షధోరణి దూరం కావడం లేదు. కఠినంగా వ్వహరిద్దామన్నా యంత్రాంగానికి ఉండే పరిమితులు అడ్డొస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు సరికొత్తగా లోచించి, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి తమ పొరపాటును మర్చిపోకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా లాంటి అత్యధిక జనసాంద్రతగల జిల్లాలో ప్రజలను కట్టడి చేయడం కత్తిమీద సాములాంటిదే. మరో పక్క కరోనా వైరస్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ప్రజల బాధ్యతను గుర్తు చేసేందుకు నడుంకట్టారు. మాస్క్ ధరించకుండా బైట తిరిగేవాళ్ళను కరోనా విధులకు వినియోగించమని పోలీసు యంత్రాంగానికి సూచించారు. రోడ్లమీదు, జనం గుమిగూడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్‌లు పర్యవేక్షిస్తూ అక్కడ మాస్క్‌లు పెట్టుకోని వాళ్ళను గుర్తిస్తున్నారు. వారికి ఒక మాస్క్‌ను ఇచ్చి, తోటి వాళ్ళకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. మాస్క్‌లు పెట్టుకోవాలని, తాను పెట్టుకోకపోవడంతోనే గంట పాటు ఈ విధంగా ప్రచారం చేయాలన్న పనిష్మెంట్‌ను పొందానని చెబుతూ సదరు వ్యక్తులు చేస్తున్న ప్రచారం మంచి ఫలితాలను ఇస్తుందన్న ఆశాభావాన్ని యంత్రాంగం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే షాపుల వారు మాస్క్‌లు ధరించకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే వారి దుకాణాలను వారం రోజుల పాటు సీజ్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసారు. ‘నో మాస్క్.. నో ఎంట్రీ.. నో సర్వీస్..’ పేరిట కొనసాగుతున్న ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందన్న ప్రజలంతా ఆశావహ దృక్ఫథంతో ఉన్నారు.
9017