iDreamPost
android-app
ios-app

కాంబో మేజిక్ రిపీట్ అవుతుందా ?

  • Published Mar 12, 2020 | 12:31 PM Updated Updated Mar 12, 2020 | 12:31 PM
కాంబో మేజిక్ రిపీట్ అవుతుందా ?

ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ దాన్ని మూడు నెలల లోపే పూర్తి చేసేలా డెడ్ లైన్ పెట్టుకున్నారన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. దసరాకు రిలీజ్ చేయాలన్న లక్ష్యంతో పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని వేగంగా కానిస్తారట. అయితే దీని తర్వాత బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా ఉండొచ్చన్న టాక్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. కారణం లేకపోలేదు. గోపాల్ ట్రాక్ రికార్డు గత కొంత కాలంగా అసలు బాలేదు. గోపీచంద్ నయనతారలతో తీసిన ఆరడుగుల బులెట్ రిలీజ్ దగ్గరే ఆగిపోయింది. ఇది జరిగి నాలుగేళ్లు దాటుతున్నా ల్యాబ్ నుంచి బయటికి రాలేదు. ఆ తర్వాత ఆయన ఇంకో ప్రాజెక్ట్ చేసే ఆలోచన చేయలేదు.

ఇప్పుడు మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఈ న్యూస్ వచ్చింది. నిజానికి బాలయ్య-గోపాల్ లది అద్భుతమైన కాంబినేషన్. లారీ డ్రైవర్- రౌడీఇన్స్పెక్టర్ లాంటి మాస్ మసాలా బ్లాక్ బస్టర్స్ ని 90వ దశకంలోనే ఇచ్చారు గోపాల్. ఇక సమరసింహారెడ్డి సృష్టించిన చరిత్ర అందరికి తెలిసిందే. నభూతో నభవిష్యత్ అనే తరహాలో అప్పట్లో అది సృష్టించిన రికార్డులు చూసి అందరూ నోరెళ్ళబెట్టారు. అతి తక్కువ గ్యాప్ లోనే ఇదే కాంబో నరసింహనాయుడు లాంటి మరో ఇండస్ట్రీ హిట్ తో వాళ్ళ రికార్డులు వాళ్ళే బ్రేక్ చేశారు. కానీ పలనాటి బ్రహ్మనాయుడు రూపంలో వచ్చిన పీడకల దీనికి నిలువునా బ్రేక్ వేసింది. మితిమీరిన హీరోయిజంతో బి గోపాల్ బాలయ్యను చూపించిన తీరు నవ్వులపాలు చేసింది. ఈ ఇద్దరికీ మొదటి డిజాస్టర్ పడింది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అలా తీయడంలో తనదే తప్పని గోపాల్ ఒప్పుకున్నారు కూడా. సరే ఇదంతా గతం అనుకుంటే కెప్టెన్ కుర్చీకి ఇన్నేళ్లు దూరంగా ఉన్న బి గోపాల్ నిజంగా మునుపటి స్థాయిలో మేజిక్ చేయగలరా అనేదే అభిమానుల సందేహం. నిన్నటి తరంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దాసరి, కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు ఇప్పటితరం టేస్ట్ కు తగట్టు సినిమాలను మలచలేక సైలెంట్ అయిపోయారు. కోడి రామకృష్ణ గారు సైతం చివరి దశలో హిట్లు అందుకున్న దాఖలాలు లేవు. అసలే వరస ఫ్లాపులతో సతమవుతున్న బాలకృష్ణకు బి గోపాల్ ఎలాంటి సినిమా ఇస్తాడో అనే డౌట్ రావడం సహజం. ఇప్పటికైతే ఇది ఆలోచన స్టేజిలోనే ఉందని బాలయ్య చెప్పేదాకా అధికారికంగా ఖరారని చెప్పలేమని సన్నిహితుల మాట.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş