iDreamPost
android-app
ios-app

Pushpa OTT : పుష్ప చూపిన దారి సరైనదేనా

  • Published Jan 07, 2022 | 8:19 AM Updated Updated Jan 07, 2022 | 8:19 AM
Pushpa OTT : పుష్ప చూపిన దారి సరైనదేనా

ఇవాళ రాత్రి 8 గంటల నుంచి పుష్ప పార్ట్ 1 ది రైజ్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తన రెగ్యులర్ సంప్రదాయానికి భిన్నంగా రాత్రి 8 గంటల నుంచి దీన్ని అందుబాటులో ఉంచుతోంది అమెజాన్. హిందీ మినహాయించి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా థియేటర్లలో ఉండగానే కేవలం మూడు వారాలకే డిజిటల్ కు ఇచ్చేయడం పట్ల అభిమానులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ముందే చేసుకున్న అగ్రిమెంట్ వల్ల తప్పలేదని నిర్మాతలు అంటున్నారట. హిందీలో మాత్రం విరగాడేస్తోందని హిందీ ట్రేడ్ అనలిస్టులతో రెగ్యులర్ గా ట్వీట్లు వేయిస్తూనే ఉన్నారు. ఎంతవరకు నిజమో కానీ సోషల్ మీడియాలో ఇవి బాగా వైరల్ అయ్యాయి.

పుష్పతో పాటు లక్ష్య, వరుడు కావలెను కూడా ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఒకటి ఆహా, రెండోది జీ5లో హోమ్ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యాయి. అసలు సినిమా రిలీజైన కనీసం నాలుగు వారాల దాకా డిజిటల్ కు ఇవ్వకూడదన్న సూత్రాన్ని ఎవరూ పాటించడం లేదు. ఆ మధ్య లవ్ స్టోరీ లాంటి ఒకటి రెండు తప్ప దాదాపు అన్నీ పుష్ప తరహాలో నెల తిరక్కుండానే చిన్ని తెరలపై వచ్చినవే. మరి థియేటర్లను కాపాడాలి ఓటిటిని ప్రోత్సహించకూడదని చెబుతున్న అగ్ర నిర్మాతలు ఇలాంటి పరిణామాల పట్ల మాత్రం నోరు విప్పకపోవడం విచిత్రం. నేను ఓటిటి కోసమే తీస్తానని బహిరంగంగా చెప్పిన సురేష్ బాబే కొంత నయం.

రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ ప్రీమియర్లు ఇంకా వేగమందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా సినిమాలు ఓటిటి తలుపులు తడుతున్నాయట. సూర్యవంశీ తప్ప గత ఆరేడు నెలల కాలంలో ఏ ఒక్క బాలీవుడ్ మూవీ పెట్టుబడిని వెనక్కు ఇవ్వలేకపోయింది. పుష్ప వసూళ్లను చూశాక తాము మాస్ మార్కెట్ ని ఎంత నిర్లక్ష్యం చేశామో అర్థం చేసుకుంటున్నాయి. అందుకే అర్బన్ ఆడియన్స్ కోసమా తీసిన వాటిని ఓటిటికి ఇవ్వడమే కరెక్ట్ అని భావించి ఆ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. పుష్ప ఇవాళ రాత్రి నుంచి ఆన్ లైన్ లోనూ రికార్డుల మోత మోగించడం ఖాయమని పరిశీలకుల అంచనా

Also Read : Acharya : రాజమౌళి చేతిలో విడుదల మంత్రం