iDreamPost
android-app
ios-app

Bheemla Nayak : పవన్ సినిమాలో ముఖ్యమైన రిపేర్

  • Published Nov 09, 2021 | 9:30 AM Updated Updated Nov 09, 2021 | 9:30 AM
Bheemla Nayak : పవన్ సినిమాలో ముఖ్యమైన రిపేర్

పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఎంత బ్యాలన్స్ ఉందనేది బయటికి చెప్పడం లేదు కానీ ఐశ్వర్య రాజేష్ స్థానంలో వచ్చిన సంయుక్త తాలూకు సన్నివేశాలు ఇప్పుడు తీస్తున్నారు. ఇటీవలే రిలీజైన లాలా భీమ్లా టైటిల్ ట్రాక్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ ట్రాక్ దిశగా దూసుకుపోతోంది. దీనికి మరింత హైప్ తెచ్చేందుకు డిసెంబర్ 31న డిజె వెర్షన్ ను కంపోజ్ చేస్తున్నాడు తమన్. ఫ్యాన్స్ మాత్రం ఈ పాటకు ఊగిపోతున్నారు. ఇదంతా ఓకే కానీ జనవరి 12కి సినిమా విడుదల అవుతుందా లేదా అనే దాని గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ మధ్య డేట్ ను ప్రస్తావించడం మానేశారు.

ఇక అసలు విషయానికి వస్తే రీమేక్ వెర్షన్ లో లెన్త్ ని బాగా తగ్గిస్తున్నారట. మలయాళంలో నిడివి 3 గంటలకు దగ్గర ఉంటుంది. దాన్ని చూసిన మనవాళ్ళు కూడా ల్యాగ్ ఫీలయ్యారు. ఈ కథకు అంత అవసరం లేదు. అయినా కూడా అక్కడ వర్కౌట్ అయ్యింది కానీ ఇక్కడ బోర్ కొట్టిందో ఫలితం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే పాటలు అదనంగా జోడించినా కూడా ఫైనల్ గా రెండున్నర గంటలు మాత్రమే వచ్చేలా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దారట. కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ టేబుల్ దగ్గర పక్కనపెట్టినా వాటిని తర్వాత యుట్యూబ్ లో వదలడం ద్వారా అదనపు ఆదాయం తెచ్చుకునే ప్లాన్లో ఉన్నారట

ఒక పోలీస్ ఆఫీసర్, ఒక వాలంటరీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మధ్య జరిగియే ఈగోల యుద్ధంగా జరిగే ఈ కథలో పవన్ రానా పాత్రలే కీలకంగా ఉంటాయి. ఇతర క్యాస్టింగ్ ఉంటుంది కానీ స్క్రీన్ మొత్తం దాదాపు ఈ ఇద్దరే కనిపిస్తారు. అయ్యారే అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా మీదే ఇతని ఆశలన్నీ ఉన్నాయి. హిట్ అయితే డైరెక్ట్ గా టాప్ లీగ్ లోకి దూసుకుపోవచ్చు. ఊహించిన దానికన్నా ఎక్కువ బజ్ రావడం పట్ల తనూ ఆనందంగానే ఉన్నాడు. కాకపోతే సంక్రాంతి బరిలో దిగుతుందా లేదా అనే అనుమానాలకు మాత్రం అర్జెంటుగా చెక్ పడాల్సి ఉంది

Also Read : Arjuna Phalguna : ఊహించని యుద్ధంలో గెలుపు కోసం పోరాటం