Arjuna Phalguna : ఊహించని యుద్ధంలో గెలుపు కోసం పోరాటం

By iDream Post Nov. 09, 2021, 02:30 pm IST
Arjuna Phalguna : ఊహించని యుద్ధంలో గెలుపు కోసం పోరాటం

తండ్రి లేని సమయంలో శత్రువులైన కౌరవులను ఎదురుకునేందుకు లోపలికి వెళ్లడమే తప్ప బయటికి రావడం తెలియని అభిమన్యుడి గురించి కథలో సీరియల్ లో చూశాం. ఒకవేళ నిజంగా అందులో అర్జునుడు వెళ్లాల్సి వస్తే అప్పుడు ఏం జరిగేది. సరిగ్గా ఇదే పాయింట్ తో రూపొందుతున్న సినిమా అర్జునా ఫల్గుణా. శ్రీవిష్ణు హీరోగా జోహార్ ఫేమ్ తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ ని ఇవాళ విడుదల చేశారు. వైల్డ్ డాగ్, ఆచార్య నిర్మాతలు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ సంభాషణలు సమకూర్చడం విశేషం. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు.

అనగనగా ఒక ఊరు. స్నేహితులతో సరదాగా జీవితం గడుపుతున్న ఓ యువకుడి జీవితంలో గుర్తు తెలియని గ్యాంగ్ ప్రవేశిస్తుంది. తన ప్రమేయం లేకపోయినా వాళ్ళు చేసిన తప్పులకు నేరాలకు తను ఇరుక్కుంటాడు. పద్మవ్యూహంలో చిక్కుకున్నానని గుర్తించి అందులో నుంచి బయటికి వచ్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతాడు. అసలు వాళ్లకు మన హీరోకు కనెక్షన్ ఏంటి, ఇతన్నే ఎందుకు టార్గె ట్ చేశారు లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే చూడాలి. ఎప్పుడూ డిఫరెంట్ కథలతో ట్రై చేసే శ్రీవిష్ణు మరోసారి ఫ్రెష్ సబ్జెక్టు ఎంచుకున్నాడు. రాజరాజ చోరకు పూర్తి భిన్నమైన పాత్రలో ఇందులో ఒదిగిపోయాడు.

విజువల్స్ ఆసక్తి రేపెలా ఉన్నాయి. పైకి సీరియస్ డ్రామాగా అనిపిస్తున్నప్పటికీ ఎంటర్ టైన్మెంట్ ని కూడా జోడించారు. శ్రీవిష్ణు ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా ప్రొజెక్ట్ చేయడం అందులో భాగమే. అమృతా అయ్యర్ హీరోయిన్ కాగా సీనియర్ నరేష్, శివాజీ రాజా, రంగస్థలం మహేష్, చైతన్య, రాజ్ కుమార్ చౌదరి ఇతర తారాగణం. జగదీశ్ చీకటి ఛాయాగ్రహణం అందించారు. మొత్తానికి హైప్ తేవడంలో టీజర్ ఉపయోగపడింది. రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాని అర్జునా ఫల్గుణ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బడ్జెట్ లిమిట్ గానే పెట్టారు కానీ కంటెంట్ మాత్రం సాలిడ్ గానే కనిపిస్తోంది.

Also Read : Akhanda : బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp