ఢిల్లీ శాసన సభ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏడు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌటింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగింది. ఉదయం నుంచి ఫలితాల సరళి ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే సాగింది. అందరూ ఊహించనట్లుగానే ఆప్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
బీజేపీ రెండంకెల సంఖ్య చేరుకుంటుందని ఆశించిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. ఉదయం నుంచి దాదాపు 20 స్థానాల్లో ఆధిక్యం కనబర్చిన బీజేపీ ఆ తర్వాత రౌండ్లు కొనసాగే కొద్దీ వెనుకంజ వేసింది. బీజేపీ అభ్యర్థులను ఆప్ వెనక్కి నెట్టి విజయం సాధించింది.
కాగా, ఢిల్లీ శాసన సభను రద్దు చేస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. గవర్నర్ నిర్ణయంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఢిల్లీ సీఎంగా అర్వింద్ కేజ్రీవాల్ వరుసగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.