ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ రోజు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది.
కరోనా కష్టకాలంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం జగన్ భావించారు. ఆర్థిక సహాయం కోసం ఇప్పటికే రెండు సార్లు లేఖలు కూడా రాశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఈ రోజు సీఎం జగన్ 3 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, 4:45 గంటలకు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటి కావాల్సి ఉంది, రాత్రి 10 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత తిరిగి రాష్ట్రానికి రావాల్సి ఉంది.
అయితే కరోనా లాక్‌డౌన్ సడలింపుల పరిణామాలపై హోం మంత్రి అమిత్ షా బిజీగా ఉండడంతో సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు.
8374