iDreamPost
iDreamPost
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు నిజంగా చాలా తెలివైనవోడే. కాకపోతే తన తెలివితేటలు మొత్తాన్ని నెగిటివ్ రాజకీయాలకే ఉపయోగిస్తున్నాడు. చంద్రబాబు ఎంత తెలివైనవాడంటే తనకు మద్దతుగా ఉండటానికి ఇతర రాజకీయ పార్టీల్లో కూడా ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వ్యవస్ధల్లో తన మనుషులను పెట్టుకోవటం అన్నది ఇతర పార్టీల్లోని సైన్యానికి బోనస్ అని చెప్పుకోవచ్చు.
ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఒంటిరిగానే ఎదుర్కొన్నాడు. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠంతో పాటు పార్టీ అధ్యక్ష పదవిని కబ్జా చేసిన తర్వాత ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేయటం మొన్ననే. ఏదో ఓ పార్టీతో పొత్తు లేకుండా చంద్రబాబు ఏ ఎన్నికను కూడా ఎదుర్కోలేదు. ఎందుకంటే సొంతంగా తనకున్న బలమెంతో చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే మొన్నటి ఎన్నికల్లో తనతో కలవటానికి ఏ పార్టీ కూడా ఇష్టపడకపోవటంతో వేరే దారిలేక ఒంటిరి పోరాటం చేసి చతికిలపడ్డాడు.
ఎప్పుడైతే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడో అప్పటికప్పుడే పెద్ద మాస్టర్ ప్లాన్ వేసేశాడు. జగన్ ను తానొక్కడే ఎదుర్కోలేనన్న విషయం అర్ధమవ్వగానే తన మద్దతుదారులనే ఇతర పార్టీల్లోకి పంపేశాడు. విచిత్రమేమిటంటే బిజెపిలో చంద్రబాబుకి మద్దతుదారులున్నారు. సిపిఐలో స్ట్రాంగ్ సపోర్టర్లున్నారు. జనసేన అంటే దాదాపు చంద్రబాబు సొంతపార్టీకిందే లెక్కనుకోండి. కాబట్టే చంద్రబాబు సేవకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సదా సిద్ధంగా ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
చూశారా జగన్ ను ఎదుర్కోవటానికి తనకు మద్దతుగా చంద్రబాబు ఇటు బిజెపిలో కొందరిని, సిపిఐతో పాటు జనసేనానిని కూడా ఎంత చక్కగా ఏర్పాటు చేసుకున్నాడో. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనకు మద్దతుగా ఇతర పార్టీల్లో చంద్రబాబు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళలో ఒక్కరికి కూడా జనబలం లేదు అందరూ పేపర్ టైగర్సే. వీళ్ళ విషయంలో జనాలకు బాగా క్లారిటి ఉంది కాబట్టి జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుతో ఎంతమంది గొంతులు కలుపుతున్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు.