iDreamPost
android-app
ios-app

సీఎం కు రాజధాని రైతుల కృతజ్ఞతలు

సీఎం కు రాజధాని రైతుల కృతజ్ఞతలు

రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ను రైతులు కలిశారు. అమరావతి ప్రాంత రైతులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించింది.

పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు పరిహారం పదిహేనేళ్ల పాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాది జరీ భూమికి ఐదు వేల రూపాయలు, మెట్టకు మూడు వేల రూపాయల చొప్పున కౌలు పెంచనున్నారు. చివరి ఐదేళ్లు జరీ భూమికి లక్ష రూపాయలు, మెట్ట భూమికి ఏకరానికి 60 వేల రూపాయలు ఇవ్వనున్నారు. భూమి లేని పేదలకు (రైతు కూలీలు) ప్రతి నెలా ఇచ్చే పింఛన్‌ రెట్టింపు చేశారు. ప్రస్తుతం 2500 రూపాయలు ఇస్తుండగా.. దాన్ని 5 వేలకు పెంచారు.