iDreamPost
android-app
ios-app

చిట్టిబాబు, భరత్ లకు బంటు షాక్

  • Published Jan 25, 2020 | 12:22 PM Updated Updated Jan 25, 2020 | 12:22 PM
చిట్టిబాబు, భరత్ లకు బంటు షాక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో రచ్చ చేస్తోంది. ఇప్పటికే ట్రిపుల్ మిలియన్ మార్క్ ని సునాయాసంగా దాటేసిన బంటు ఇప్పుడు టాప్ 3 పొజిషన్ తీసుకునేందుకు పరుగులు పెడుతున్నాడు. బాహుబలి రెండు భాగాలు ఫస్ట్ టూ ప్లేసెస్ లో ఉండగా ఆ తర్వాత స్థానంలో రంగస్థలం, భరత్ అనే నేనులు ఉన్నాయి. ప్రస్తుతం అల వైకుంఠపురములో 3.2 మిలియన్ దగ్గర ఉంది. ఇంకో 0.3 మిలియన్లు రాబడితే ఈజీగా చిట్టిబాబు, భరత్ లను దాటేసి మూడో స్థానాన్ని ఆక్రమించుకుంటాడు.

నిన్నటిదాకా ఐదో స్థానంలో ఉన్న ప్రభాస్ సాహో ఇప్పుడు కిందకు వెళ్లిపోయింది. అల వైకుంఠపురములోకు నాలుగు మిలియన్లు అసాధ్యమేనని ట్రేడ్ టాక్. సరిలేరు నీకెవ్వరుతో తీవ్రమైన పోటీ ఎదురుకున్న అల వైకుంఠపురములో ఇంత త్వరగా టాప్ లీగ్ లోకి దూసుకుపోవడం పట్ల అభిమానుల సంతోషం మాములుగా లేదు ప్రస్తుతం మూడో వారంలోకి అడుగుపెట్టబోతున్న బన్నీ సినిమా ఎంతలేదన్నా ఇంకో పది రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది.

అందులోనూ దగ్గర్లో స్టార్ హీరోల సినిమాలు ఏవీ విడుదలకు లేవు. వచ్చిన ఒక్క డిస్కో రాజా అంచనాలు అందుకోలేక చేతులు ఎత్తేసింది. ఇక ఆపై నాగ శౌర్య అశ్వద్ధామ, శర్వానంద్ జాను, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ క్యూలో ఉన్నాయి. వీటిలో ఏది బ్లాక్ బస్టర్ హిట్ అయినా అప్పుడు దాని ప్రభావం అల వైకుంఠపురములో ఉంటుందే తప్ప ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మొత్తానికి ఇప్పటిదాకా యుఎస్ లో బలమైన జెండా పాతలేకపోయిన అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా టాప్ 3కి చేరువ కావడం రాబోయే సినిమాలకు అతి పెద్ద బూస్ట్ లాగా పనిచేయనుంది.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbet