iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ OTT ఎంట్రీ అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?

Chiranjeevi OTT Debue: మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారంటూ గట్టిగానే బజ్ క్రియేట్ అయ్యింది. అయితే అందులో ఎంత నిజముందో చూడండి.

Chiranjeevi OTT Debue: మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారంటూ గట్టిగానే బజ్ క్రియేట్ అయ్యింది. అయితే అందులో ఎంత నిజముందో చూడండి.

మెగాస్టార్ OTT ఎంట్రీ అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు తల్చుకోని సినిమా లవర్స్ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ హీరో ఫ్యాన్ అయినా చిరు సినిమా అనగానే థియేటర్ కు పరిగెడతారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీని పంచిపెడుతున్న వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో వెబ్ సిరీస్ చేసేందుకు చిరు రెడీ అయిపోయారు అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వార్త చూసిన తర్వాత ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అసలు ఆ వార్తల్లో నిజమెంత అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఓటీటీ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న ప్లాట్ ఫామ్. స్టార్ హీరోల మొదలు స్టార్ హీరోయిన్లు, బడా బడా యాక్టర్స్ అందరూ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. సౌత్ లో అయితే మీర ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ అంతూ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పుడిప్పుడే హీరోలు కూడా అదే బాట పడుతున్నారు. అందులో భాగంగానే.. చిరంజీవి ఓటీటీ ఎంట్రీ ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి కూడా సరైన కథ దొరికితే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి తనకేమీ అభ్యంతరం లేదు అంటూ మనసులో ఉన్న మాటను భయటపెట్టారు. ఇంకేముంది ఇప్పుడు చిరంజీవి ఓటీటీ ఎంట్రీ టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది.

కొన్ని వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి త్వరలోనే ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు అంటూ చెబుతున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.. చిరుతో కలిసి ఒక మంచి వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతోంది అంటూ చెబుతున్నారు. అందుకు సంబంధించి స్టోరీ కూడా రెడీగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ పేరే ఎందుకు వచ్చింది అంటే.. ఇటీవల నెట్ ఫ్లిక్స్ సీఈవో టాలీవుడ్ లో పలువురు ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు మెగా ఫ్యామిలీ మొదలు మహేశ్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోల నుంచి ప్రముఖ దర్శక  నిర్మాతల వరకు అందరినీ పలకరించి వెళ్లారు. ఆ సమయంలోనే చిరుతో వెబ్ సిరీస్ ఓకే చేయించుకున్నారు అంటూ ఇప్పుడు చెబుతున్నారు. త్వరలోనే మెగా ఫ్యాన్స్ కోరిక తీరుతుంది అంటూ బలంగా చెబుతున్నారు.

చిరు ఓటీటీ ఎంట్రీ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. చిరంజీవి ఓటీటీ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటోంది నిజమే గానీ, స్టోరీ సెట్ అయ్యింది.. నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తోంది అనడంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి చిరంజీవి విశ్వంభర మీద ఫుల్ ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై చిరు కూడా చాలానే హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే త్రిష కూడా షూటింగ్ లో పాల్గొనడం స్టార్ట్ చేసింది. ఈ మూవీ బడ్జెట్ కూడా దాదాపు రూ.100 కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. ఈ విశ్వంభర చిత్రం తర్వాత కూడా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ ఇంకా కొన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతుందనే చెప్పాలి. మరి.. చిరంజీవి ఓటీటీ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.