iDreamPost

వెబ్ వాట్సాప్ లో కొత్త సేఫ్టీ ఫీచర్.. ఇక మీ మెసేజ్ లు చూడటం అసాధ్యం!

Safety Feature For Web Whatsapp: వాట్సాప్ కు ఉన్న ఆదరణ గురించి, వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాట్సాప్ యూజర్లకు ఒక కొత్త సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

Safety Feature For Web Whatsapp: వాట్సాప్ కు ఉన్న ఆదరణ గురించి, వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాట్సాప్ యూజర్లకు ఒక కొత్త సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

వెబ్ వాట్సాప్ లో కొత్త సేఫ్టీ ఫీచర్.. ఇక మీ మెసేజ్ లు చూడటం అసాధ్యం!

ప్రస్తుతం అంతా ఆన్ లైన్, సోషల్ మీడియా అయిపోయింది. పక్కన ఉన్నప్పుడు తిన్నావా అని అడుగుతారో లేదో తెలీదు గానీ.. కరెక్ట్ టైమ్ కి తిన్నావా అంటూ మెసేజ్లు పెట్టేస్తుంటారు. గ్రూపు చాటింగ్లు, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ అంటూ నానా హంగామా చేస్తూ ఉంటారు. ఇదంతా ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వచ్చిన తర్వాతే బాగా పెరిగిపోయింది. ఈ యాప్ కు వరల్డ్ వైడ్ గా అత్యధికంగా 278 కోట్లకుపై యూజర్లు ఉన్నారు. అంత మంది వాడుతున్నారు అంటే.. దానికి తగినట్లుగా ఫీచర్లు, ప్రైవసీ, సేఫ్టీని అందిచాల్సిన బాధ్యత ఆ యాప్ పై ఉంది. అందుకే ఈసారి మరో గొప్ప ప్రైవసీ ఫీచర్ ను వాట్సాప్ తీసుకొచ్చింది.

సాధారణంగా వాట్సాప్ సంస్థ తరచుగా యూజర్స్ కోసం ఫీచర్స్ ని అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. యూజర్ ఎక్స్ పీరియన్స్ ని మెరుగు పరచడమే కాకుండా.. వారి వ్యక్తిగత గోప్యత, భద్రతను కల్పిస్తూ ఉంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో ఫీచర్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ను వాట్సాప్ తీసుకుంటూ వచ్చింది. తాజాగా వెబ్ వాట్సాప్ యూజర్స్ కోసం ఒక ప్రైవసీ ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు అందరూ వాట్సాప్ ని ఆఫీసుల్లో కూడా వాడుతున్నారు. అయితే ఆఫీస్ లో వాట్సాప్ ని ప్రతిసారి లాగౌట్ చేయలేం. ఒక్కోసారి సిస్టమ్ లాక్ చేయడం మర్చిపోతాం. లేదంటే ఇంటికి వెళ్లేటప్పుడు వాట్సాప్ ని లాగౌట్ చేయం. ఇలాంటి సందర్భాల్లో మీ వాట్సాప్ మెసేజ్ లను వేరేవాళ్లు చూసే ప్రమాదం ఉంది.

మీ వ్యక్తిగత గోప్యతకు ఇక్కడ భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అలా జరగకుండా అరికట్టేందుకు వాట్సాప్ ఇప్పుడు స్క్రీన్ లాక్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మీరు మీ మొబైల్ లో ఎలాగైతే వాట్సాప్ కి లాక్ పెట్టుకుంటారో.. అలాగే వెబ్ వాట్సాప్ లో కూడా ఒక స్క్రీన్ లాక్ ని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల మీరు మీ వాట్సాప్ ని లాగౌట్ చేయడం మర్చిపోయినా.. సిస్టమ్ ని లాక్ చేయడం మర్చిపోయినా కూడా వాట్సాప్ మెసేజ్ లు ఎవరూ చూడలేరు. దీనికోసం మీరు ప్రత్యేకంగా వాట్సాప్ ని లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎనేబుల్ చేసిన తర్వాత మీరు సెలక్ట్ చేసుకున్న సమయానికి ఆటోమేటిక్ గా వెబ్ వాట్సాప్ స్క్రీన్ లాక్ అయిపోతుంది. మరి.. ఆ స్క్రీన్ లాక్ ఎలా ఎనేబుల్ చేయాలో చూడండి.

మొదట మీరు మీ వెబ్ వాట్సాప్ లో మెనూలోకి వెళ్లాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ లో ఉండే ప్రైవసీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు లాస్ట్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. స్క్రీన్ లాక్ అని ఉంటుంది. దానిని ఓపెన్ చేయాలి. అక్కడ మీరు స్క్రీన్ లాక్ ని ఎనేబుల్ చేసిన తర్వాత పాస్ వర్డ్ అడుగుతుంది. మీరు ఒక పాస్ట్ వర్డ్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ టైమ్ ఆప్షన్ ఉంటుంది. ఒక నిమిషం తర్వాత, 15 నిమిషాల తర్వాత, ఒక గంట తర్వాత అని ఉంటుంది. మీకు నచ్చిన టైమ్ ని ఎంచుకోవాలి. మీరు వెబ్ వాట్సాప్ వాడకుండా ఉంటే.. మీరు ఎంత టైమ్ అయితే ఎంచుకున్నారో ఆ టైమ్ తర్వాత ఆటోమేటిక్ స్క్రీన్ లాక్ అయిపోతుంది. అలా లాక్ అయిన తర్వాత మీరు పెట్టుకున్న పాస్ వర్డ్ ని టైప్ చేసి అన్ లాక్ చేసుకోవాలి. మరి.. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ స్క్రీన్ లాక్ ఆప్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి