iDreamPost
android-app
ios-app

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. నెట్ లేకున్నా వీడియోలు, ఫోటోలు పంపించుకోవచ్చు

  • Published Jul 24, 2024 | 5:40 PM Updated Updated Jul 24, 2024 | 5:40 PM

WhatsApp Testing New Feature Like AirDrop In iOS Devices For File Sharing Including Videos, Photos Without Internet: వాట్సాప్ ద్వారా వీడియోలు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లు పక్కనే ఉన్న వ్యక్తులకు పంపుకోవాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఏ జిరాక్స్ సెంటర్ కో వెళ్లి ప్రింట్ అవుట్ కావాలంటే ఫైల్ వాట్సాప్ లో షేర్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఇంటర్నెట్ డేటా ఖర్చు. అయితే వాట్సాప్ ఇప్పుడు కొత్త ఫీచర్ ని తీసుకురానుంది. ఈ ఫీచర్ తో ఇంటర్నెట్ లేకుండా ఫైల్స్ ని షేర్ చేసుకోవచ్చు.

WhatsApp Testing New Feature Like AirDrop In iOS Devices For File Sharing Including Videos, Photos Without Internet: వాట్సాప్ ద్వారా వీడియోలు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లు పక్కనే ఉన్న వ్యక్తులకు పంపుకోవాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఏ జిరాక్స్ సెంటర్ కో వెళ్లి ప్రింట్ అవుట్ కావాలంటే ఫైల్ వాట్సాప్ లో షేర్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఇంటర్నెట్ డేటా ఖర్చు. అయితే వాట్సాప్ ఇప్పుడు కొత్త ఫీచర్ ని తీసుకురానుంది. ఈ ఫీచర్ తో ఇంటర్నెట్ లేకుండా ఫైల్స్ ని షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. నెట్ లేకున్నా వీడియోలు, ఫోటోలు పంపించుకోవచ్చు

వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల అనుభూతిని పెంచేందుకు రకరకాల ఫీచర్స్ ని అప్డేట్ చేస్తూ వస్తుంది. సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల వాయిస్ ఇస్తే టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసే ఫీచర్ ని టెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది. వాట్సాప్ కొత్తగా ఇప్పుడు ఒక ఫీచర్ ని టెస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫైల్స్ ని పంపించుకోవచ్చు. ఐఫోన్ లో ఎయిర్ డ్రాప్ ఫీచర్ లాంటిదాన్ని వాట్సాప్ ఇప్పుడు ఒక ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఫైల్ షేరింగ్ ఫీచర్ మీద ప్రస్తుతం వాట్సాప్ పని చేస్తుంది. దగ్గర దగ్గరగా పక్క పక్కనే ఉన్న యూజర్లు డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ ఏమైనా పంపించుకోవాలంటే కనుక ఇంటర్నెట్ లేకున్నా దగ్గరలో ఉన్న ఫోన్లు, ల్యాప్ టాప్ లు వంటి డివైజెస్ ద్వారా పంపించుకునేలా ఫీచర్ ని టెస్ట్ చేస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

ముందు ఈ అప్ డేట్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి అందుబాటులోకి వచ్చాక ఆ తర్వాత ఐఓఎస్ యూజర్స్ కి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ బీటాఇన్ఫో దీనికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ ని కూడా షేర్ చేసింది. ఫీచర్ బీటా టెస్టింగ్ అప్లికేషన్ స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ లో ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది. ఆ స్కానర్ ద్వారా ఫోటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్స్ వంటివి షేర్ చేసుకోవచ్చు. నియర్ బై షేర్ ఫీచర్ ఇది. యాపిల్ లో ఉన్న ఎయిర్ డ్రాప్ మాదిరిగానే ఐఓఎస్ యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్ ని తీసుకురావాలని వాట్సాప్ భావిస్తుంది. ఈ అప్డేట్ ఫ్యూచర్ వెర్షన్ వాట్సాప్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

Send Files Without Internet In WhatsApp

ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ లో క్యూఆర్ స్కానర్ ని స్కాన్ చేయడం ద్వారా వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్స్ వంటి వాటిని ఇంటర్నెట్ డేటా లేకున్నా కూడా సులువుగా షేర్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న డివైజ్ డిటెక్షన్ టెక్నాలజీ ద్వారా ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ ఫీచర్ కనుక వస్తే కనుక నిజంగా వాట్సాప్ యూజర్లకు మేలు జరుగుతుంది. పక్క పక్కనే ఉన్న ఫ్రెండ్స్ కి లేదా ఇంకెవరికైనా ఫైల్స్ పంపాలంటే ఇంటర్నెట్ డేటా వేస్ట్ అవుతుంది. ఎక్కడో దూరంగా ఉన్నవారికి పంపినప్పుడు డేటా వినియోగం అంటే తప్పదు. కానీ పక్కనే ఉన్న వారికి షేర్ చేయడానికి డేటా లాస్ కదా. అందుకేనేమో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది. ఇంటర్నెట్ లేకుండానే ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. మరి వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.