iDreamPost
android-app
ios-app

భారత్ లోకి మరో కొత్త ప్రో సిరీస్.. చేతిలో Sony కెమెరా ఉన్నట్లే!

  • Published Jul 24, 2024 | 8:37 PM Updated Updated Jul 24, 2024 | 8:37 PM

Realme 13 5G- 13 Pro+ 5G Models Price And Rumored Specifications: మార్కెట్ లోకి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం ఆ ఫోన్ మీ చేతిలో ఉంటే.. ఒక సోనీ కెమెరా ఉన్నట్లే. లాంఛ్ అధికారిక డేట్ కూడా వచ్చేసింది.

Realme 13 5G- 13 Pro+ 5G Models Price And Rumored Specifications: మార్కెట్ లోకి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం ఆ ఫోన్ మీ చేతిలో ఉంటే.. ఒక సోనీ కెమెరా ఉన్నట్లే. లాంఛ్ అధికారిక డేట్ కూడా వచ్చేసింది.

  • Published Jul 24, 2024 | 8:37 PMUpdated Jul 24, 2024 | 8:37 PM
భారత్ లోకి మరో కొత్త ప్రో సిరీస్.. చేతిలో Sony కెమెరా ఉన్నట్లే!

ప్రస్తుతం భారత్.. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లకు మంచి మార్కెట్ గా అవతరించింది. ప్రతి ఫోన్ కంపెనీ కూడా భారత్ ని టార్గెట్ చేస్తూ కొత్త కొత్త మోడల్స్, ప్రో సిరీస్లు తీసుకొస్తోంది. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో కంపెనీ తమ సరికొత్త ప్రో సిరీస్ తో వచ్చేసింది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జులై 30న తమ కంపెనీ నుంచి రెండు స్మార్ట్ ఫోన్ మోడల్స్, వాచ్, బడ్స్ తో రాబోతున్నట్లు చెప్పింది. అయితే ఈ ఫోన్లో చాలాగొప్ప ప్రత్యేకతలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే రూమర్డ్ ఫీచర్స్ మాత్రమే టెక్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. అసలు ఫీచర్స్ రావాలి అంటే ఇంకో వారంపాటు ఆగాల్సిందే. ఇప్పటి వరకు ఉన్న అప్ డేట్స్ ప్రకారం ఆ ఫీచర్స్ ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న స్మార్ట్ ఫోన్ కంపెనీ మరేదో కాదు.. రియల్ మి. ఇప్పటికే భారత విపణిలో రియల్ మీకి మంచి ఆదరణ, డిమాండ్ కూడా ఉంది. ఇప్పుడు దానిని వినియోగించుకుంటూ వారి ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు రియల్ మి నుంచి 13 సిరీస్ రాబోతోంది. రియల్ మి 13 ప్రో 5జీ, రియల్ మి 13 ప్రో+ 5జీ మోడల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే గత పది రోజులుగా రియల్ మి కంపెనీ ఈ 13 సిరీస్ కి సంబంధించి చాలానే ప్రచారం చేస్తూ వచ్చింది. ఇప్పుడు లాంఛ్ డేట్ రాగానే మరోసారి ఈ 13 సిరీస్ ఫోన్లు వార్తల్లో నిలిచాయి. ఇందులో ముఖ్యంగా వీళ్లు కెమెరా మీద ఫోకస్ చేశారు. అందుకే దాని గురించే ఎక్కువ పబ్లిసిటీ కూడా చేస్తున్నారు.

ఈ ఫోన్లో కెమెరా విషయానికి వస్తే.. 13 ప్రో+ మోడల్ లో తొలిసారి 50ఎంపీ సోనీ lyt701 సెన్సార్ రాబోతోంది. అలాగే 50 ఎంపీ సోనీ lyt600 పెరిస్కోపిక్ ఫొటో లెన్స్ కూడా ఉంటుంది. అలాగే 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో ఈ రియల్ మి 13 ప్రో+ ఫోన్ అయితే రాబోతోంది. ఇంక రియల్ మి 13 మోడల్ చూస్తే.. 50 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్+ 2 ఎంపీ కెమెరా లభిస్తుంది. అలాగే రెండు మోడల్స్ కు ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ వస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ మోడల్స్ కి సంబంధించి ఫొటోలు, వీడియోలు, రియల్ మి సంస్థ తమ సోషల్ మీడియాలో పేజెస్ లో పోస్ట్ చేస్తూనే ఉంది. ఫొటోగ్రఫీ, వీడియోలు, రీల్స్ వంటివి చేసుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలు, ప్రైస్ డీటెయిల్స్ మాత్రం తెలియాలంటే జులై 30 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర రూ.35 వేల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

రియల్ మి 13 సిరీస్ రూమర్స్ ఫీచర్స్:

  • 6.7 కర్వ్ డ్ ఆమోలెడ్ డిస్ ప్లే
  • 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్
  • 5000 mah బ్యాటరీ

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet