iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ తో ఉన్న ఈ బుడ్డోడు.. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్!

  • Published Dec 21, 2023 | 1:05 PM Updated Updated Dec 21, 2023 | 1:05 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్, స్టార్ యాక్టర్స్ చైల్డ్ హుడ్ పిక్స్.  మొదట్లో హీరో హీరోయిన్ల చిన్నప్పటి పిక్స్ పెడుతూ.. గెస్ ది స్టార్ అంటూ పోస్ట్స్ పెడుతుంటారు. తాజాగా అలానే ఓ ఫేమస్ స్టార్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్, స్టార్ యాక్టర్స్ చైల్డ్ హుడ్ పిక్స్.  మొదట్లో హీరో హీరోయిన్ల చిన్నప్పటి పిక్స్ పెడుతూ.. గెస్ ది స్టార్ అంటూ పోస్ట్స్ పెడుతుంటారు. తాజాగా అలానే ఓ ఫేమస్ స్టార్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Dec 21, 2023 | 1:05 PMUpdated Dec 21, 2023 | 1:05 PM
సూపర్ స్టార్ తో ఉన్న ఈ బుడ్డోడు.. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్!

సోషల్ మీడియాలో ఏమైనా ఒక్కసారి  వైరల్ అయ్యాయి అంటే.. అది కాస్త ట్రెండ్ గా మారిపోతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్, స్టార్ యాక్టర్స్ చైల్డ్ హుడ్ పిక్స్.  మొదట్లో హీరో హీరోయిన్ల చిన్నప్పటి పిక్స్ పెడుతూ.. గెస్ ది స్టార్ అంటూ పోస్ట్స్ పెట్టారు. ఆ తర్వాత హీరో హీరోయిన్లతో పాటు పాపులర్ వ్యక్తుల చిన్ననాటి ఫొటోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్, హీరో ధనుష్ తో కలిసి ఓ బుడతడు దిగిన ఫొటోస్..  సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. ఆ బుడతడు మరెవరో కాదు..

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇతను కూడా ఒకడు. అంతేకాకుండా  ఇతను ఒక మంచి సింగర్ కూడా. తన పదేళ్ల వయస్సు నుంచే సంగీతం మీద మంచి పట్టు సాధించి.. ఇప్పటివరకు ఎన్నో అవార్డ్స్ ను తన సొంతం చేసుకున్నాడు. ఇతను మొదట తమిళ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత సౌత్ లోను తన సంగీత దర్శకత్వ ప్రతిభతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం సౌత్ లో బాగా డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఈ కుర్రాడు ఒకడు. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరంటే!  2011లో వచ్చిన  ‘వై థిస్ కొలవెరి కొలవెరి డీ’ అనే పాటతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో ఆదరణ పొందిన ‘అనిరుథ్ రవిచంద్రన్’.

హీరో ధనుష్ నటించిన  ‘త్రి’  సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమ్యాడు అనిరుధ్. ఆ చిత్రంలో అనిరుధ్ కంపోజ్ చేసిన ‘వై థిస్ కొలవెరి’ సాంగ్ కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా వరుస ఆఫర్స్ తో అటు తమిళంలోనూ, తెలుగులోనూ బిజీ అయిపోయాడు. సంగీతంతో పాటు సింగర్ గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇంకా.. ఇతను  కీబోర్డ్, పియానో లాంటి సంగీత వాయిద్యాలు కూడా ప్లే చేస్తాడు. లండన్ లో ఫేమస్ మ్యూజిక్ కాలేజీ ట్రినిటీలో ఈ సంగీత వాయిద్యాలపై పట్టు సారించి .. అక్కడ ఫ్యూజన్ బ్యాండ్ లో పనిచేశాడు. ఆ తర్వాత  చెన్నైలో సౌండ్ ఇంజనీరింగ్ కోర్సు కూడా పూర్తి చేశాడు. ఇక ప్రస్తుతం సంగీత ప్రపంచంలో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ని అందిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు అనిరుధ్.

ఇక ఇక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి దిగిన ఫోటో విషయానికొస్తే.. అది సుమారు 30 సంవత్సరాలు క్రితం నాటి ఫోటో. అనిరుధ్ కు రజినీకాంత్ కు మధ్య బంధుత్వం ఉంది. ఈ సంగీత దర్శకుడు.. నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు, స్వయానా లతా రజినీకాంత్ కు మేనల్లుడు అవుతాడు . ఒకానొక చిత్రం షూటింగ్ సమయంలో తలైవా..అనిరుధ్ ను ఎత్తుకుని ఫోటో దిగారు. ఆ ఫోటో కాస్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి, ఫొటోలో  ముద్దుగా కనిపిస్తున్న చిన్నోడిగా.. ఇప్పుడు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న..  అనిరుథ్ రవిచంద్రన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet