iDreamPost

వీడియో: కలకలం రేపుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం!

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఓ వీడియో కలకలం రేపింది. కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఓ వీడియో కలకలం రేపింది. కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వీడియో: కలకలం రేపుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం!

ప్రస్తుతం తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక వాతావరణం కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో ఈ నెల30 జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఉంది. ఇక్కడ ఫలితాల కోసం ప్రధాన పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే ఈలోపు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ని కొందరూ అధికారులు ఓపెన్‌ చేసినట్లు కలకలం రేగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో  బాలఘాట్‌లో పోస్టల్‌ బ్యాలెట్లు వ్యవహారంలో ట్యాపరింగ్‌కు పాల్పడే అవకాశం ఉందంటూ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఇటీవలే మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఓ విషయం కలకలం రేపింది. కొందరు అధికారులు పోస్టల్ బ్యాలెట్ పేపర్లను ఓపెన్ చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు స్పందించారు. పోస్టల్‌ బ్యాలెట్లు వ్యవహారంలో ట్యాపరింగ్‌కు పాల్పడే అవకాశం ఉందంటూ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అలాగే తమ కార్యకర్తలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి వివాదాలు జరగకుండా చూసుకోవాలని కాంగ్రెస్ ట్విట్టర్‌లో పేర్కొంది.

ఇక ఆ వీడియోను పరిశీలించినట్లైయితే కొందరూ అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌లను క్రమబద్ధీకరిస్తున్నట్లు కనిపించింది. దీంతో కాంగ్రెస్‌ ఆ జిల్లా కలెక్టరే స్ట్రాంగ్‌ రూంని ఓపెన్‌ చేశారని, ఇతర అధికారులు కూడా అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివాదం చెలరేగిన కాసేపటికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు షఫ్‌ఖత్‌ ఖాన్‌ మాట్లాడారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఈ విషయం గురించి తమ పార్టీ ప్రతినిధికి సరైన సమాధానం ఇవ్వకపోవడం ఈ గందరగోళం ఏర్పడిందని తెలిపారు. అయితే సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఈ గందరగోళాన్ని క్లియర్‌ చేసిందని వివరించారు.

ఈ వివాదం విషయమై బాలాఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిని డివిజనల్ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. దీంతో వివాదం ఆగిపోయింది. ఈ వివాదంపై స్థానిక మేజిస్ట్రేట్ గోపాల్ సోనీ విలేకరులతో మాట్లాడారు. ఎలక్ట్రానికల్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ను ఉంచడం, వాటిని 50 బండిల్స్‌గా క్రమబద్ధీకరించడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. సీసీటీవీ కెమెరాల సమక్షంలోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతుందని తెలిపారు. అలాగే బయట సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు.

వాస్తవానికి స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలోని ఒక గది పోస్టల్ బ్యాలెట్ల కోసం స్ట్రాంగ్ రూమ్‌గా కేటాయించారు. ఇక్కడ బాలాఘాట్ అసెంబ్లీ స్థానంలోని బ్యాలెట్లు తోపాటు మరో ఐదు అసెంబ్లీ నియోజవర్గాల పోస్టల్ బ్యాలెట్లను కూడా సీసీటీవీ నిఘాలోనే భద్రపరచడమే జరుగుతుందని స్థానిక మెజిస్ట్రేట్ వివరణ ఇచ్చారు. ఈ నెల17న ముగిసిన పోలింగ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా యత్నిస్తుంది.

2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దక్కించుకుంది. అయితే  ఆపార్టీకి చెందిన సీనియర్ జ్యోతిరాధిత్య సింధియా 20 మందికి పైగా విధేయులైన  ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచి ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్‌. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్‌ని మట్టికరిపించేలా ప్రజలు తమనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పోస్టల్ బ్యాలెంట్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి