iDreamPost
android-app
ios-app

దర్శకేంద్రుడికి కోసం స్టార్ల కలయిక

  • Published Oct 10, 2021 | 6:51 AM Updated Updated Oct 10, 2021 | 6:51 AM
దర్శకేంద్రుడికి కోసం స్టార్ల కలయిక

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD ఈ నెల 15 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లను ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. దీనికి చాలా ప్రత్యేకమైన కారణం ఉంది. తన మొదటి సినిమా దర్శకుడిగా కలియుగ పాండవులు నుంచి వెంకటేష్ కు రాఘవేంద్రరావుతో మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత కూడా వీళ్ళ కలయికలో సినిమాలు వచ్చాయి. కూలి నెంబర్ వన్, ముద్దుల ప్రియుడు, సాహసవీరుడు సాగరకన్య, ఒంటరి పోరాటం, భారతంలో అర్జునుడు, సుందరకాండ లాంటి హిట్లు ఈ కాంబోలో ఉన్నాయి

సో అలాంటప్పుడు నటుడిగా రాఘవేంద్రరావు మొదటి సినిమా వేడుకకు రావడం కన్నా విశేషం ఏముంటుంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే వీళ్ళ బంధం అంతకన్నా ప్రత్యేకం. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, చాణక్య శపథం, రౌడీ అల్లుడు, యుద్ధభూమి, రుద్రనేత్ర, కొండవీటి రాజా, మంచి దొంగ లాంటి మరపురాని చిత్రాలు బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. పరస్పరం అన్నదమ్ముల్లా కలిసిపోయే ఆత్మీయత ఉంది. సో చిరుకి ఇంత కన్నా వేరే కారణం కావాలా. అందులోనూ తనకు బాగా ఇష్టుడు అయిన శ్రీకాంత్ వారసుడి మొదటి కమర్షియల్ తెరంగేట్రం. ఇలా ఈ ట్రిపుల్ కాంబో సెట్ అయ్యిందన్న మాట.

పెళ్లి సందD మీద భారీ అంచనాలు లేవు కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే నమ్మకం టీమ్ లో ఉంది. కాకపోతే దసరా బరి కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లను కాచుకుని మరీ యుద్ధం చేయాల్సి ఉంటుంది. వరుడు కావలెను కూడా ఉంటుందన్నారు కానీ సడన్ గా ఆ చిత్ర బృందం సైలెంట్ కావడంతో వాయిదా తప్పకపోవచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పెళ్లి సందDలో రాఘవేంద్రరావు ఎలా నటించారు అనే దాని మీదే త్వరలో సెట్స్ కు వెళ్లబోయే మరో రెండు సినిమాల ఫేట్ ఆధారపడి ఉంది. ఇంత లేట్ ఏజ్ లో ఏమైనా మేజిక్ చేస్తారేమో చూడాలి

Also Read : రానా సినిమాకు మోక్షం ఎప్పుడు

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın almadridbetmadridbetmadridbetkatlaMarsbahis GirişCasibom GirişJojobet GirişCasibomMarsbahis Giriş