iDreamPost

భార్య​తో కలిసి చిల్‌ అవుతోన్న మోహన్‌ బాబు.. వైరలవుతోన్న ఫొటో!

  • Published Jul 29, 2023 | 2:04 PMUpdated Jul 29, 2023 | 2:05 PM
  • Published Jul 29, 2023 | 2:04 PMUpdated Jul 29, 2023 | 2:05 PM
భార్య​తో కలిసి చిల్‌ అవుతోన్న మోహన్‌ బాబు.. వైరలవుతోన్న ఫొటో!

టాలీవుడ్‌లో మంచు కుటుంబం మీద వచ్చినన్న ట్రోల్స్‌ ఇంకా ఎవరి మీద కూడా రావేమో. ఓ రేంజ్‌లో మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆడుకుంటారు నెటిజనులు. ఇక మంచు లక్ష్మి మీద చేసే ట్రోల్స్‌, విమర్శలకైతే లెక్కేలేదు. కానీ ఇవేం పట్టించుకోకుండా కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు మంచు హీరోలు, అలానే మంచు లక్ష్మి కూడా. ఇక ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మి పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి టాలీవుడ్‌లో తెలుగుమ్మాయి పరిస్థితి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దర్శక, నిర్మాతలు తెలుగు వారికి అవకాశాలు ఇవ్వరంటూ కుండ బద్దలు కొట్టారు. అంతేకాక తాను హాలీవుడ్‌ నుంచి ఇక్కడకు వచ్చి పెద్ద తప్పు చేశానని.. భవిష్యత్తులో అవకాశం వస్తే.. తిరిగి హాలీవుడ్‌కి వెళ్తాను అని స్పష్టం చేశారు. మంచు లక్ష్మి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇక వివాదాలు, విమర్శలు పక్కకు పెడితే మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మంచు లక్ష్మి తల్లిదండ్రులు, మోహన్‌ బాబు దంపతుల మ్యారేజ్‌ డే నేడు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసింది మంచు లక్ష్మి. ఈ ఫొటోల్లో మోహన్‌ బాబు, తన భార్యతో కలిసి సరదాగా చిల్‌ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. అలానే వారితో పాటు మంచు లక్ష్మి, ఆమె కుమార్తె కూడా ఉన్నారు.

ఇక తల్లిదండ్రుల ఫొటోలు షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. ‘‘మీరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. వైవాహిక జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కొవాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. అమ్మ మీరు కన్న కలలన్ని నిజం కావాలి. నాన్న మీ కోరికలు అన్ని తీరాలి. ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు..’’ అంటూ మంచు లక్ష్మి షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో మోహన్‌ బాబు దంపతుల అన్యోన్యతను చూసిన అభిమానులు.. మీరు ఇలాగే నిండు నూరేళ్లు కలిసి మెలసి ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి