iDreamPost

ఉమ్మడి కర్నూలులో TDPలో జనసేన కలవరం!

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలుకలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలోని టీడీపీ నేతలు కలవపడుతున్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్.

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలుకలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలోని టీడీపీ నేతలు కలవపడుతున్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్.

ఉమ్మడి కర్నూలులో TDPలో జనసేన కలవరం!

ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ స్కామ్ లో అరెస్టై జైల్లో ఉన్నప్పుడు..జనసేన అధినేత ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈపొత్తుల అంశం పలువురు టీడీపీ నేతలను కలవరపెడుతుందని పొలిటికల్ సర్కిల్ లో టాక్. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని టీడీపీ నేతల్లో జనసేన కలవర పెడుతుందంట. అందుకే టీడీపీ నేతల చేతుల్లో తరచూ గ్లాసులే కనిపిస్తున్నాయంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల్లో పొత్తుల కలవరం కనిపిస్తుంది. జనసేనతో పొత్తు తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడుతుందో అనే ఆందోళనలో ఉన్నారు నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జీలు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన కనీసం రెండు సీట్లు అడిగే అవకాశం ఉందని టాక్. ఈ నేపథ్యంలో ఆ రెండు సీట్లు తమవి కాకూడదని ఆ జిల్లా టీడీపీ నేతలు దేవుళ్లను మొక్కుకుంటున్నారంట. జనసేన  ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు సీట్లు అడగడం ఖాయమని, అలా కాకున్నా కనీసం ఒక్క సీటు అయినా  అడుగొచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

అందుకే ఏఏ సీట్లు అడిగే అవకాశం ఉంది.. ఎవరెవరికి ఎర్త్ పెడతారంటూ నియోజవర్గాల టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారంట.  జిల్లా మొత్తంపై ఎలా ఉన్నా.. జనసేన కోరే అవకాశం ఉందని భావించే కొన్ని నియోజకవర్గాలపైనే ఆందోళన కనిపిస్తుందని టాక్. ఇక సామాజిక వర్గాల లెక్కల ప్రకారం చూసుకుంటే.. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో కాపుల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆ తరువాత డోన్, బనగానపల్లెలో కూడా ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో ఆదోని నియోజవర్గంలో జనసేనకు భారీగానే ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ ఇమేజ్, కాపుల ఓట్లు జనసేనకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఈ స్థానాలపై  జనసేన కన్నేసినట్లు, వీటిలో రెండు స్థానాలను అడిగే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఇలా కాపు ఓట్లు ఉన్న ప్రకారం చూస్తే.. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ నేతలు తమ సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన పడుతున్నారు సమాచారం. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలో టీడీపీలోనే నలుగురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ సీటుకు ఇప్పటికే మాజీ మంత్రి ఫరూక్ కు ఖారారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆళ్లగడ్డ విషయానికి వస్తే.. ఆళ్లగడ్డలో ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన తరపున పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే వైసీపీ నుంచి ఆయన జనసేన పార్టీలో చేరారని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు.  ఇప్పటికే ఆయన టీడీపీ తరపున రెండు సార్లు పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు.

అటు కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గం విషయంలో జనసేన పట్టుపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మొత్తంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్క సీటు చొప్పున రెండు సీట్లు అడిగే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఎక్కడ తమ సీట్లకు ముప్పు వస్తుందోని కంగారులో ఉన్నారంట.. టార్గెట్ లో ఉన్న నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జీలు. మొత్తానికి పొత్తులు ఒకకొలిక్కి వచ్చాక. ఎవరికి సీటో.. ఎవరికి వేటో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల్లో జనసేన కలవరం పెడుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి