iDreamPost

నా రూమ్​లో అతడు సీక్రెట్ కెమెరా పెట్టాడు: ‘తీన్​మార్’ హీరోయిన్!

  • Author singhj Published - 09:37 AM, Tue - 22 August 23
  • Author singhj Published - 09:37 AM, Tue - 22 August 23
నా రూమ్​లో అతడు సీక్రెట్ కెమెరా పెట్టాడు: ‘తీన్​మార్’ హీరోయిన్!

సినీ పరిశ్రమలో ఒకట్రెండు సినిమాలతో ఓవర్​నైట్ స్లార్లు అయిపోయినవాళ్లు చాలా మందే ఉన్నారు. అదే సమయంలో పదుల కొద్దీ సినిమాలు చేస్తూ, ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగినా స్టార్ స్టేటస్ దక్కించుకోని దురదృష్టవంతులూ ఉన్నారు. ‘తీన్​మార్’ మూవీ ఫేమ్ హీరోయిన్ కృతి కర్బందా కూడా అదే కోవలోకి వస్తారని చెప్పొచ్చు. ‘బోణీ’ అనే తెలుగు చిత్రంతో 2009లో తెరంగేట్రం చేశారీ భామ. కానీ ఆ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాత పవర్​స్టార్ పవన్ కల్యాణ్ ‘తీన్​మార్​’తో మరోమారు టాలీవుడ్​లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు.

‘తీన్​మార్’ తర్వాత మంచు మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’, నందమూరి కల్యాణ్​ రామ్ ‘ఓమ్ 3డీ’, రామ్ ‘ఒంగోలు గిత్త’, రామ్ చరణ్​ ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ సినిమాలతో తెలుగువారిని పలకరించారు కృతి కర్బందా. కానీ పైసినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దీంతో తన మకాంను ముంబైకి మార్చారామె. ఈ క్రమంలో ‘రాజ్: రీబూట్’, ‘యమ్లా పగ్లా దివానా: ఫిర్‌‌ సే’, ‘హౌజ్​ఫుల్ 4’, ‘పాగల్​పంతీ’ చిత్రాలతో అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఓటీటీలో రిలీజైన ‘తైష్’లో నటనకు గానూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు కృతి. అలాంటి ఆమె గతంలో ఒక భయంకరమైన ఘటనను ఎదుర్కొన్నారట.

తాను బస చేసిన హోటల్ రూమ్​లో ఒకసారి సీక్రెట్ కెమెరాను గుర్తించానని రీసెంట్​గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి కర్బందా చెప్పారు. ఇది తనను చాలా భయపెట్టిందని అన్నారామె. తాను యాక్ట్ చేసిన ఓ కన్నడ సినిమా షూటింగ్ టైమ్​లో జరిగిన ఆ ఘటనను తాను మర్చిపోలేనన్నారు. ‘నేను ఉండే రూమ్​ను తరచూ చెక్ చేయడం నాకూ, నా టీమ్​కూ అలవాటు. అలా, నా గదిలో ఓ కెమెరాను గుర్తించాం. రూమ్​లోని సెట్ అప్ బాక్స్ బ్యాక్ సైడ్ అతడు ఉంచిన కెమెరాను చూసి నేను షాకయ్యా. అప్పటి నుంచి బయట ఎక్కడైనా ఉండాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా’ అని కృతి కర్బందా చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి