iDreamPost

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం.. అసలు కారణం ఇదే!

West Bengal train accident: బెంగాల్ లో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా.. 100కు పైగా గాయపడ్డారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు గుర్తించారు.

West Bengal train accident: బెంగాల్ లో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా.. 100కు పైగా గాయపడ్డారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు గుర్తించారు.

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం.. అసలు కారణం ఇదే!

సోమవారం పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయంలో రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. స్టేషన్ లో ఆగి ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ రైలును అదే పట్టాలపై వచ్చిన గూడ్స్ ట్రైన్ వెనకాల బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించగా.. చాలా మందికి తీవ్రం గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై అనేక అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కాంచన్ జంగ్  ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది తెలిసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కొన్ని నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో  కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసింది. ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించగా..వందల మంది గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తరువాత కూడా పలు ఘటనలు చేసుకున్నాయి. తాజాగా అదే తరహాలో పశ్చిమ బెంగాల్లో కాంచన్ జంగ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. డార్జిలింగ్‌ సమీపంలోని రంగపాణి రైల్వే స్టేషన్‌ దగ్గర కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును.. అదే పట్టాలపై వచ్చిన గూడ్స్ ట్రైన్‌ వెనకాల నుంచి ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలులోని వెనుక ఉండే మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అంతేకాక గూడ్స్‌ రైలు బోగీలు పట్టాలుతప్పి పక్కకు పడిపోయాయి. అదే సమంయలోఒక బోగీ మరో బోగీ మీదకు ఎక్కడం.. ఈ ప్రమాద తీవ్రత స్థాయిలో ఉందో తెలుపుతుంది.

కాగా..ఈ ప్రమాదానికి గల కారణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా. చాలా మంది ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. గూడ్స్‌ రైలు సిగ్నల్‌ను దాటుకుని.. కాంచన్‌జంగా రైలును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో రైల్వే అధికారులు నిర్ధారించారు. ఈక్రమంలోనే స్టేషన్ కి కాస్తా సమీపంలో ఆగి ఉన్న ఆగి వున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనకాల నుంచి ఈ గూడ్స్ ఢీకొట్టిందని అంటున్నారు. ఈఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నామనీ.. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత అటుగా వెళ్లే అగర్తల-కోల్‌కతా రైలు పట్టాలు బాగా దెబ్బతిన్నది. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి