iDreamPost

ట్రేడింగ్ ద్వారా 46 లక్షలు పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి! అంత డబ్బు ఎక్కడిదంటే?

B.Tech Student Lost 46 Lakhs: పైసా ఆదాయం లేదు. ఉద్యోగం అస్సలు లేదు. అయినా కానీ బీటెక్ చదివే విద్యార్థి 46 లక్షలు తెచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు. అసలు అంత డబ్బు ఆ విద్యార్థికి ఎక్కడిది?

B.Tech Student Lost 46 Lakhs: పైసా ఆదాయం లేదు. ఉద్యోగం అస్సలు లేదు. అయినా కానీ బీటెక్ చదివే విద్యార్థి 46 లక్షలు తెచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు. అసలు అంత డబ్బు ఆ విద్యార్థికి ఎక్కడిది?

ట్రేడింగ్ ద్వారా 46 లక్షలు పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి! అంత డబ్బు ఎక్కడిదంటే?

స్టాక్ మార్కెట్ ఇది అవగాహన లేని కొత్త వారిని తీసుకెళ్లి నడి సముద్రంలో ముంచేసినట్టు ముంచేస్తుంది. అనుభవం ఉన్న వారిని మాత్రం ఒడ్డున పడేస్తుంది. నూటికి 90 శాతానికి పైగా ఈ స్టాక్ మార్కెట్ ని నమ్మి నిండా మునుగుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ట్రేడింగ్ చేయడం.. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరి గుడ్డిగా అడ్మిన్ లు చెప్పింది చేసి నష్టపోవడం ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. పూర్తిగా అవగాహన ఉంటేనే ఎఫ్అండ్ఓలో ట్రేడింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నా గానీ కొంతమంది పట్టించుకోకుండా భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. తాజాగా ఓ బీటెక్ విద్యార్ధి ఈ ట్రేడింగ్ వలలో చిక్కుకుని లక్షలు నష్టపోయాడు. ఒక ఒక క్లయింట్ ఫైల్ చేసిన రిటర్న్స్ ని చూసిన చార్టర్డ్ అకౌంటెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

చార్టర్డ్ అకౌంటెంట్ రోషన్ తన వద్దకు వచ్చిన ఒక క్లయింట్ ఫైల్ ని చూసి షాక్ అయ్యారు. ఆ క్లయింట్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ట్రేడింగ్ లో 26 లక్షలు నష్టం వచ్చిందని ఐటీఆర్ లో పేర్కొన్నాడని అన్నారు. బీటెక్ మూడో ఏడాది చదివే విద్యార్థికి అంత డబ్బు ఎక్కడిది? ఏ ఉద్యోగం చేయకుండా అంత డబ్బు అతనికి ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని అన్నారు. ఆ బీటెక్ విద్యార్థికి ఎలాంటి ఆదాయం లేదని.. అతని తల్లిదండ్రులు విడిపోయారని.. తల్లి హోటల్ నడుపుతున్నారని సీఏ రోషన్ కి తెలిసింది. ఆ విద్యార్ధి యాప్ ల ద్వారా లోన్స్ తీసుకుని, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి.. పేరెంట్స్ కి తెలియకుండా వాళ్ళ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుని.. మొత్తం 26 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడని వెల్లడించారు.

అంతకు ముందు ఏడాదిలో 20 లక్షలు పోగొట్టుకున్నట్టు తెలిసిందని అన్నారు. కేవలం ఎఫ్అండ్ఓ ద్వారానే 46 లక్షలు కోల్పోయినట్టు సీఏ రోషన్ వెల్లడించారు. అసలు ఈ ఊబిలోకి ఎలా వచ్చావని అడిగితే.. తన ఫ్రెండ్ ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ ద్వారా కోటి రూపాయలు సంపాదించాడని విని తాను కూడా ట్రేడింగ్ లో డబ్బు సంపాదించాలని ట్రేడింగ్ మొదలుపెట్టానని బీటెక్ విద్యార్థి వెల్లడించాడు. ఫ్రెండ్స్ ద్వారా ట్రేడింగ్ గురించి తెలుసుకుని మెల్లగా బానిసయ్యాడు. గత ఏడాది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు అతనికి ట్రేడింగ్ మానేయమని చెప్పానని.. కానీ బానిస అయిపోయానంటూ ఆ విద్యార్ధి చెప్పుకొచ్చాడని సీఏ రోషన్ అన్నారు. దీంతో ఈ ఏడాది 26 లక్షలు పోగొట్టుకున్నాడని.. కానీ ఈసారి ట్రేడింగ్ జోలికి వెళ్లానని మాట ఇచ్చాడని అన్నారు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చు.. కోటీశ్వరులైపోవచ్చు అని సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ తో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి