iDreamPost

TSRTCలో ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఉద్యోగాలకు కసర్తులు ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఉద్యోగాలకు కసర్తులు ప్రారంభమయ్యాయి.

TSRTCలో ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో ఆర్టీసీకి ఆదరణ బాగా పెరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, విద్యార్థినిలు, యువతులు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకు వచ్చింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. గత డిసెంబర్ నుండి అమలులోకి వచ్చిన ఈ పథకాన్ని సద్వినియోగ పరుచుకుంటున్నారు తెలంగాణ అక్కాచెల్లెమ్మలు. గతంతో పోల్చుకుంటే.. కేవలం బస్సులోనే ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. దీంతో రద్దీ పెరిగింది. పలు మార్గాల్లో బస్సుల కొరత కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొత్త బస్సులను తీసుకు వచ్చింది. ఈ క్రమంలో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీంతో ఉద్యోగాల భర్తీకి టీఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.

గత పదేళ్ల నుండి కారుణ్య నియామకాలు మినహా టీఆర్టీసీలో ఉద్యోగాల నియామకం జరగలేదు. దీంతో ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి కసరత్తులు షురూ చేశారు అధికారులు. సుమారు 3,035 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది టీఆర్టీసీ. ఈ పదేళ్లలో చాలా మంది పదవీ విరమణలు పెరిగిపోవడం..రిక్రూట్ మెంట్స్ లేకపోవడంతో ఉద్యోగుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో 3వేల పోస్టుల భర్తీకి సంబంధించి గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపింది. గ్రీన్ సిగ్నల్ రాగానే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పనిచేస్తున్నారు.  డ్రైవర్లు 14,747 మంది ఉండగా..  కండక్టర్లు 17,410 మంది ఉన్నారు.

అంటే డ్రైవర్ల కన్నా కండక్టర్లే ఎక్కువ.  కాగా, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు దీనికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభావంతో బస్సులకు డిమాండ్ పెరిగింది. దీంతో కొత్తగా 1325 డీజిల్, 1050 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకు వస్తుంది ప్రభుత్వం. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి రానున్నాయి. అలాగే మరికొన్ని కొత్త బస్సులు తీసుకు రాబోతున్నారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే..

డ్రైవర్ పోస్టులు- 2000

శ్రామిక్-743

డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్)-114

డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)-84

డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్-40

మెడికల్ ఆఫీసర్-14

సెక్షన్ ఆఫీసర్ (సివిల్ )-11

అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-23

అకౌంట్స్ ఆఫీసర్- 6

ఈ ఉద్యోగాలకు సంబంధించిన త్వరలోనే నోటిఫికేష్ విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి