iDreamPost

ఇమ్ముతో పెళ్లిపై వర్ష కామెంట్స్! ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యింది!

  • Published Mar 02, 2024 | 6:49 PMUpdated Mar 02, 2024 | 6:49 PM

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన వారిలో ఒకరు వర్ష. తన చలాకీదనం, క్యూట్ యాక్టింగ్​తో ఎంతో మంది మనసులను దోచుకున్నారామె.

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన వారిలో ఒకరు వర్ష. తన చలాకీదనం, క్యూట్ యాక్టింగ్​తో ఎంతో మంది మనసులను దోచుకున్నారామె.

  • Published Mar 02, 2024 | 6:49 PMUpdated Mar 02, 2024 | 6:49 PM
ఇమ్ముతో పెళ్లిపై వర్ష కామెంట్స్! ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యింది!

వర్ష.. ఈ పేరు చెబితే ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. అదే జబర్దస్త్ వర్ష అంటే మాత్రం అందరూ ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ కామెడీ షో ద్వారా ఆమె చాలా పాపులారిటీ సంపాదించారు. హుషారైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. తొలుత సీరియల్ ఆర్టిస్ట్​గా కెరీర్​ను స్టార్ట్ చేసిన వర్ష.. జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ షో ద్వారా ఆమెకు హ్యూజ్ ఫ్యాన్​బేస్ ఏర్పడింది. జబర్దస్త్​లో మరో కమెడియన్ ఇమ్మానుయేల్​తో కలసి వర్ష చేసే స్కిట్స్​ బాగా పాపులర్. ఈ కపుల్ ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన కాన్సెప్టులతో స్కిట్స్ ప్లాన్ చేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఈ షోలో వీళ్లిద్దరి జోడీ బాగా పాపులర్ అయింది. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని.. త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై ఫస్ట్ టైమ్ ఓపెన్ అయ్యారు వర్ష.

బిగ్​బాస్​లోకి రమ్మంటూ మూడుసార్లు తనకు ఆఫర్ వచ్చిందన్నారు వర్ష. కానీ తాను వెళ్లలేదని.. వెళ్లేందుకు ఇంకా టైమ్ ఉందని అనుకుంటున్నానని చెప్పారు. తాను గొడవలకు దూరంగా ఉంటానన్నారు. ఇమ్మానుయేల్​తో మ్యారేజ్ విషయం గురించి ఎందుకు చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. వివాహం జరగకపోయినా తమ షోస్ చూడాలన్నారు. ఇక మీదట సీరియల్స్​లో మాత్రం నటించబోనని వర్ష క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​, అక్కినేని నట వారసుడు నాగచైతన్య అంటే తనకు చాలా ఇష్టమన్నారు. వాళ్లిద్దరి మూవీస్​లో చిన్న రోల్ వచ్చినా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇంకా చాలా విషయాలపై ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘బిగ్​బాస్​కు రమ్మంటూ మూడుసార్లు నాకు ఆఫర్ వచ్చింది. కానీ వెళ్లలేదు. హౌస్​లోకి వెళ్లేందుకు ఇంకా టైమ్ ఉందని భావిస్తున్నా. నేను గొడవలకు దూరంగా ఉంటా. ఫైట్స్ అంటే నాకు భయం. ఎవరితోనైనా గొడవపడితే తిరిగి వాళ్లతో మూవ్ అవడం కష్టం. నాకు వంట కూడా రాదు. ఆ షోలో అది చేయలేదు, ఇది చేయలేదంటూ పరువు తీస్తారు. అందుకే వెళ్లలేదు. బహుశా వచ్చే సీజన్​లో హౌస్​లోకి వెళ్తానేమో. అప్పటికి నా మైండ్​సెట్​ను బట్టి డిసిషన్ తీసుకుంటా. ఇక మీదట కేవలం షోస్ మాత్రమే చేస్తా. ఇమ్యానుయేల్​తో పెళ్లి జరిగినా.. జరగకపోయినా షోస్ చూడండి. జీవితంలో ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఇంట్లో ఫుడ్​తో పాటు బయట ఫుడ్ కూడా తింటా. అయినా ఓవర్ థింక్ చేయకుండా హ్యాపీగా ఉంటా. అదే నా బ్యూటీ సీక్రెట్’ అని వర్ష చెప్పుకొచ్చారు. మరి.. తన మ్యారేజ్​పై వర్ష చేసిన వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాక్సర్ మహ్మద్ అలీ పాత్రలో రానా దగ్గుబాటి! ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో క్లారిటీ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి