iDreamPost

బాక్సర్ మహ్మద్ అలీ పాత్రలో రానా దగ్గుబాటి! ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో క్లారిటీ..

Rana On Muhammad Ali Movie: విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ఇటీవల తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. మహ్మద్ అలీ పాత్ర చేయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు.

Rana On Muhammad Ali Movie: విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ఇటీవల తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. మహ్మద్ అలీ పాత్ర చేయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు.

బాక్సర్ మహ్మద్ అలీ పాత్రలో రానా దగ్గుబాటి! ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో క్లారిటీ..

తెలుగులో ఉన్న అతికొద్ది విలక్షణ నటుల్లో రానా దగ్గుబాటి కూడా ఒకరు. ఆయన చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ఒకసారి హీరోగా వస్తే.. ఇంకోసారి మంచి సపోర్టింగ్ రోల్ చేస్తారు. మరోసారి విలన్ గా తన నటనతో కట్టిపడేస్తాడు. ఇలా ఒక కథ, ఒక పాత్ర అని ఉండదు. పాత్ర నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాడు. ప్రసుతం రానా దగ్గుబాటి ప్రాజెక్ట్స్ గురించి చాలానే వార్తలు వస్తున్నాయి. వాటిలో బాక్సర్ మహ్మద్ అలీ పాత్ర కూడా ఒకటిగా చెప్తున్నారు. ఆ విషయంపై స్వయంగా రానా క్లారిటీ ఇచ్చాడు.

రానా దగ్గుబాటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఎన్నో విభిన్న పాత్రల్లో మెరిసిన రానా.. తన కెరీర్ ని తరహాలో కొనసాగిస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా రానా గ్రేట్ బాక్సర్ మహ్మద్ అలీ పాత్ర పోషించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా కూడా ఆ ప్రచారం అయితే జరిగింది. తాజాగా రానా కూడా తన మనసులో ఉన్న మాటను ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనకు బాక్సింగ్ అంటే విపరీతమైన ఇష్టం ఉంది అని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు హమ్మద్ అలీ, మైక్ టైసన్ అంటే ఎంతో ఇష్టమనే విషయాన్ని వెల్లిబుచ్చాడు. అంతేకాకుండా తనకు మహ్మద్ అలీ పాత్రలో నటించాలని ఉందనే విషయాన్ని ప్రకటించాడు. రానా చెప్పిన దాన్ని బట్టి చూస్తే మహ్మద్ అలీ పాత్రలో రానా త్వరలోనే కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

రానా ఇటీవల బాక్సింగ్ బే అనే గొప్ప కార్యక్రమంలో భాగం అయ్యాడు. దేశవ్యాప్తంగా బాక్సింగ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. “అందరి పిల్లల్లాగే నేను కూడా చిన్నప్పటి నుంచి బాక్సింగ్ చూస్తూనే పెరిగాను. నేను మహ్మద్ అలీ, మైక్ టైసన్ కి పెద్ద అభిమానిని. నా దగ్గర బాక్సర్స్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి. నేను తరచూ వాటిని వేసుకుని తిరుగుతూ ఉంటాను. నేను కచ్చితంగా మహ్మద్ అలీ సినిమా చేసి.. అతని స్టోరీని చెప్పేందుకు ట్రై చేస్తాను” అంటూ రానా దగ్గుబాటి క్లారిటీ ఇచ్చాడు. అంటే ఇండియన్ సినిమాలో మహ్మద్ అలీ లైఫ్ స్టోరీకి సంబంధించి సినిమా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో మహ్మద్ అలీగా రానా కనిపించే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఈ విషయమే నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంక రానా సినిమాల విషయానికి వస్తే.. సరైన హిట్టు కోసం కొన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. అందుకు తనకు నేను రాజు నేనే మంత్రి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించిన తేజాకు అవకాశం ఇచ్చాడు. వీళ్ల కాంబో మరోసారి రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. రాక్షస రాజా అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. ఇప్పిటికే ఈ మూవీకి సంబధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పెద్ద మిషన్ గన్ తో ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ తరహాలో ఆ పోస్టర్ ఉంది. ఈ మూవీలో కీలక పాత్రలో మోహన్ లాల్ కూడా నటిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. బావ సంతోషం కోసం ఏదైనా చేసే బావమరిది క్యారెక్టర్ లో రానా కనిపించబోతున్నాడు అంటూ చెబుతున్నారు. మరి.. మహమద్ అలీ పాత్ర చేయాలని ఉంది అని రానా దగ్గుబాటి చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి