iDreamPost

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

  • Published May 20, 2024 | 10:07 AMUpdated May 20, 2024 | 10:07 AM

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, హుస్సేన్‌ అమీరబ్దొల్లహియన్  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న అనగా ఆదివారం కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వారు మరణించినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, హుస్సేన్‌ అమీరబ్దొల్లహియన్  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న అనగా ఆదివారం కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వారు మరణించినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.

  • Published May 20, 2024 | 10:07 AMUpdated May 20, 2024 | 10:07 AM
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న అనగా ఆదివారం కూలిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఇబ్రహీం ఆ హెలికాప్టర్‌ అనేది అజర్ బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్‌ సమయంలో..  తూర్పు అజర్‌బైజాన్‌లో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఆ హెలికాప్టర్‌ లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాటు ఆయన సిబ్బంది అలాగే  విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీరబ్దొల్లహియన్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. కాగా, హెలికాప్టర్‌ అనేది వాతవరణం అనుకూలించకపోవడం, దట్టమైన పొగమంచు కారణంగా.. అటవీ ప్రాంతంలో కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో వారి ఆచూకీ గురించి ఇంత వరకూ తెలియరాలేదు. దీంతో  సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకుంది. కూలిన హెలికాప్టర్ జాడను గుర్తించేందుకు సైన్యం, సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీరబ్దొల్లహియన్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని అంతార్జతీయ మీడియా వెల్లడించింది.

అయితే ఇరాన్‌, అజర్‌ బైజాన్‌ సరిహద్దుల్లో రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో శకలాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. కానీ, తాజాగా ఇరాన్‌ బలగాలు.. అజర్‌బైజాన్‌-ఇరాన్‌ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతంలో.. హెలికాఫ్టర్‌ పూర్తిగా కాలిపోయిన స్థితిలో  గుర్తించిమని తెలిపింది. ఇక ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ప్రకటించాయి. ‍కనుక మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షం, మంచుకురుస్తుండటంతో సహాయక చర్యలు ఆటంకంగా మారాయని తెలిపింది.  మరోవైపు రైసీ క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్‌ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఇక రైసీ మరణ వార‍్త వినడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక రైసీ మరణంతో పలు దేశ అధ్యక్షులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి