iDreamPost
android-app
ios-app

ఇంతకంటే బ్యాడ్‌ లక్‌ మరోటి ఉండదు.. రూ.33 కోట్లు గెలిచాడు.. ఆ ఆనందంలో మృతి

  • Published Jun 25, 2024 | 1:46 PMUpdated Jun 25, 2024 | 1:46 PM

అదృష్టం తలుపు తట్టినప్పుడు తీయడం ఎంత ముఖ్యమో.. దాన్ని అంతే జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్‌. తాజాగా ఓ వ్యక్తి 33 కోట్ల రూపాయలు గెలిచాడు. ఆ ఆనందంలో పాపం చనిపోయాడు. ఆ వివరాలు..

అదృష్టం తలుపు తట్టినప్పుడు తీయడం ఎంత ముఖ్యమో.. దాన్ని అంతే జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్‌. తాజాగా ఓ వ్యక్తి 33 కోట్ల రూపాయలు గెలిచాడు. ఆ ఆనందంలో పాపం చనిపోయాడు. ఆ వివరాలు..

  • Published Jun 25, 2024 | 1:46 PMUpdated Jun 25, 2024 | 1:46 PM
ఇంతకంటే బ్యాడ్‌ లక్‌ మరోటి ఉండదు.. రూ.33 కోట్లు గెలిచాడు.. ఆ ఆనందంలో మృతి

కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు మనిషి గుండె ఎన్ని బాధలైనా తట్టుకుంటుందేమో కానీ.. జీవితాన్ని మార్చే సంతోషకరమైన వార్తలను పెద్దగా తట్టుకోలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి గర్భం నుంచి ఈ భూమ్మీదకు వచ్చాక.. మనకు సుఖాలకన్నా కష్టాలే అధికంగా ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక కష్టాలు. వాటన్నింటిని దాటుకుని ముందుకు సాగుతాం. అలా మనిషి ఊహా తెలిసిన నాటి నుంచి కష్టాలతోనే ఎక్కువ కాల‍ం ​సహవాసం చేస్తాడు. అందుకే ఎంత పెద్ద బ్యాడ్‌ న్యూస్‌ను అయినా జీర్ణించుకోగలగుతాడు.. కానీ పట్టరాని ఆనందం కలిగించే విషయం తెలిస్తే.. ఒక్కసారిగా గుండె ఉక్కిరిబిక్కిరి అయ్యి ఊపిరి వదులుతాడు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. 33 కోట్ల రూపాయలు గెలిచిన ఆనందం తట్టుకోలేక చనిపోయాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు.

ఈ సంఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. క్యాసినోలో ఓ వ్యక్తి ఏకంగా 33 కోట్ల రూపాయలు గెలిచాడు. అయితే ముందుగా ఆ విషయాన్ని అతడే నమ్మలేదు. ఎప్పుడు డబ్బులు పొగొట్టుకునే వాడు.. ఒక్కసారిగా అంత భారీ మొత్తం గెలవడంతో.. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆ ఆనందంలోనే గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ సంఘటన సింగపూర్‌లోని మారినా బే సాండ్స్‌ క్యాసినోలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇక్కడకు తరచుగా వచ్చేశాడు. దాంతో అక్కడున్న సిబ్బందికి అతడు సుపరిచితుడే. ఇక ఎప్పుడు క్యాసినోకి వచ్చినా.. ఓడిపోవడమే కానీ.. గెలవడం లేదు. ఇలా ఉండగా.. తాజాగా క్యాసినోకు వచ్చిన ఆ వ్యక్తి.. భారీ మొత్తంలో పందెం కాశాడు. వస్తే.. లైఫ్‌ సెట్టు.. రాకపోతే ఇక జీవితంలో క్యాసినో ముఖం చూడకూడదు అనుకున్నాడు.

అయితే అప్పటి వరకు ఆ క్యాసినోలో అతడు ఓడిపోయిన సందర్భాలే ఉన్నాయి తప్ప గెలవలేదు. కానీ ఆరోజు అతడిని అదృష్టం వరించింది. అప్పటి వరకు ఓటమి తప్ప మరోకటి తెలియని ఆ వ్యక్తి.. ఆ రోజు మాత్రం క్యాసినోలో ఏకంగా 4 బిలియన్‌ డాలర్లు గెలిచాడు. మన ఇండియన్‌ కరెన్సీలో చెప్పాలంటే.. ఏకంగా 33 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ విజయంతో అతడి సంతోషం ఎన్నో రెట్లు పెరిగింది. నిజంగా నేనే ఇంత భారీ మొత్తం గెలిచానా అనే అనుమానం కూడా వచ్చింది. తర్వాత తానే విజేతను అని తెలసుకున్న ఆ వ్యక్తి.. పట్టరాని సంతోషంలో కేకలు వేశాడు.. గంతులు వేస్తూ.. తన ఆనందాన్ని అక్కడున్న వారితో పంచుకున్నాడు. ఇలా సంతోషపడుతున్న సమయంలోనే గుండె దగ్గర నెమ్మదిగా నొప్పి మొదలయ్యింది. కానీ దాన్ని అతడు పెద్దగా పట్టించుకోలేదు.

సంతోషంలో అలా ఎగురుతూ ఉండగానే.. ఒక్కసారిగా గుండె పట్టేసినట్లై కుప్పకూలాడు. కార్డియాక్‌ అరెస్ట్‌తో అక్కడికక్కడే కన్ను మూశాడు. పాపం ఇన్నాళ్లు ఓడిపోతూనే వస్తోన్న ఆ వ్యక్తి.. ఒక్కసారే 4 బిలియన్‌ డాలర్ల భారీ మొత్తంలో గెలవడంతో ఇక తన జీవితం సెటిల్‌ అవుతుందని భావించాడు. కానీ కోట్ల రూపాయలు గెలిచిన ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇక సదరు వ్యక్తి కిందపడిన వెంటనే గమనించిన తోటివారు.. అతడికి వైద్యం అందించేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. పాపం కోట్ల రూపాయలు గెలిచాడనే సంతోషం క్షణకాలం పాటు కూడా నిలవలేదు కదా.. అని క్యాసినో సిబ్బంది, అతడి బంధువులు వాపోతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి