iDreamPost

IPLలో ఆ 4 టీమ్స్​ను తప్ప మిగతా జట్లను పట్టించుకోని ఫ్యాన్స్.. కారణం?

  • Published Mar 29, 2024 | 3:42 PMUpdated Mar 29, 2024 | 3:42 PM

ఈసారి ఐపీఎల్​లో నాలుగు టీమ్స్​ను మాత్రమే ఫ్యాన్స్ పట్టించుకుంటున్నారు. ఆ జట్ల మ్యాచుల్ని తెగ చూస్తున్న ఆడియెన్స్.. మిగతా టీమ్స్​ను మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

ఈసారి ఐపీఎల్​లో నాలుగు టీమ్స్​ను మాత్రమే ఫ్యాన్స్ పట్టించుకుంటున్నారు. ఆ జట్ల మ్యాచుల్ని తెగ చూస్తున్న ఆడియెన్స్.. మిగతా టీమ్స్​ను మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

  • Published Mar 29, 2024 | 3:42 PMUpdated Mar 29, 2024 | 3:42 PM
IPLలో ఆ 4 టీమ్స్​ను తప్ప మిగతా జట్లను పట్టించుకోని ఫ్యాన్స్.. కారణం?

ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. చాలా మటుకు మ్యాచులు ఫైనల్ ఓవర్ వరకు వెళ్తుండటంతో ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి మునివేళ్లపై నిలబడి మ్యాచులు చూస్తున్నారు. స్టేడియంలో ఉన్న అభిమానులు మాత్రమే కాదు బయట ఫోన్లు, టీవీల్లో కూడా కోట్లాది మంది ఆడియెన్స్ మ్యాచుల్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఫ్రీగా స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉండటంతో జియో సినిమా యాప్​లో మ్యాచులు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది. కోట్లకు కోట్లు వ్యూస్ వస్తున్నాయి. ఆటగాళ్ల ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలు, మెరుపు ఫీల్డింగ్, అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనల్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అయితే సరిగ్గా గమనిస్తే ఈసారి నాలుగు టీమ్స్ మ్యాచులకు మాత్రమే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఆ 4 జట్లను తప్ప మిగతా టీమ్స్​ను అభిమానులు పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

చెన్నై సూపర్ కింగ్స్, సన్​రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచులకు మాత్రమే ఈ సీజన్​లో వ్యూయర్​షిప్ ఎక్కువగా ఉంటోంది. ఈ నాలుగు జట్ల మ్యాచ్​లకు స్టేడియాలు నిండుతున్నాయి. టీవీలతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ వ్యూస్ కూడా వేరే లెవల్​లో ఉంటున్నాయి. అయితే రాజస్థాన్ రాయల్స్, కోల్​కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచులను మాత్రం అభిమానులు పట్టించుకోవడం లేదు. ఈ టీమ్స్​ ఆడుతున్నాయంటే ఫ్యాన్స్ లైట్ తీసుకుంటున్నారు. అదే సీఎస్​కే, ఎస్ఆర్​హెచ్, ఎంఐ, ఆర్సీబీ మ్యాచులు అంటే మాత్రం ఎగబడి చూస్తున్నారు. అర్ధరాత్రి మ్యాచ్ ముగిసే వరకు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. చెన్నై సహా మిగిలిన మూడు టీమ్స్​ మ్యాచుల్ని చూడటానికి మిగతా టీమ్స్​ను లైట్ తీసుకోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

సీఎస్​కేలో ఎంఎస్ ధోని లాంటి లెజెండరీ ప్లేయర్ ఉన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈ టీమ్​కు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఈ జట్టు మ్యాచ్ అంటే చాలా ఎక్కడలేని ఎగ్జయింట్ క్రియేట్ అవుతోంది. ఇక, ఒక్కసారి కప్ నెగ్గకున్నా విరాట్ కోహ్లీ లాంటి సూపర్​స్టార్ టీమ్​లో ఉండటంతో ఆర్సీబీ మ్యాచులకు కూడా అంతే ఆసక్తి నెలకొంటుంది. అందునా బెంగళూరుకు ఉన్న లాయల్ ఫ్యాన్ బేస్​ ఆ టీమ్​కు కొండంత బలంగా మారారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో ఉండటంతో ముంబై మ్యాచుల మీద కూడా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హిట్​మ్యాన్ బ్యాటింగ్ చూడాలని అంతా కోరుకుంటున్నారు. అదే టైమ్​లో రోహిత్-పాండ్యా వివాదం కారణంగా కూడా ఎంఐ మ్యాచులకు వ్యూస్ బాగా వస్తున్నాయి. ఇక, ఎస్​ఆర్​హెచ్​ ఈసారి డేంజరస్ టీమ్​గా మారింది. జట్టులోని బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతుండటంతో సన్​రైజర్స్ ఆట చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. లీగ్​లో అత్యంత ఆదరణ కలిగిన టీమ్స్​లో ఒకటిగా ఉండటం కూడా ఎస్​ఆర్​హెచ్​కు ప్లస్​గా మారింది.

ఓవరాల్​గా చూసుకుంటే సీఎస్​కే, ఎస్ఆర్​హెచ్, ఎంఐ, ఆర్సీబీలో టాప్ ప్లేయర్లు ఉండటం, వాళ్లకు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉండటం, ఆటగాళ్లు ఫుల్ ఫామ్​లో ఉండటం, మ్యాచ్​లు ఆఖరి ఓవర్ వరకు వెళ్తుండటంతో ఆ టీమ్స్ మ్యాచులకు వ్యూస్ అదిరిపోతున్నాయి. అదే మిగతా జట్లకు అభిమాన గణం తక్కువగా ఉండటం, వాటిల్లో పెద్దగా స్టార్లు లేకపోవడం, ఆ టీమ్ మ్యాచులు చప్పగా సాగుతుండటం, భారీ స్కోర్లు నమోదు కాకపోవడం మైనస్​గా మారిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది లీగ్ దశ కాబట్టి టాప్ టీమ్స్ మ్యాచ్​లు చూస్తారు. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే టైమ్​కు మిగతా జట్లు కూడా జోరు పెంచి విజయాలు అందుకుంటే వాళ్ల మ్యాచులకు కూడా వ్యూయర్​షిప్ పెరిగే ఛాన్స్ ఉంది. సేమ్ టైమ్ బ్రాడ్​కాస్టర్స్ కూడా టాప్ టీమ్స్​తో పాటు మిగిలిన జట్లకు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రకటనలతో ఆసక్తి పెంచితే పరిస్థితుల్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి.. ఆ నాలుగు టీమ్స్​కు తప్ప మిగతా జట్లను ఆడియెన్స్ లైట్ తీసుకోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: RR vs DC: వీడియో: అంపైర్​తో దాదా, పాంటింగ్ గొడవ.. ఇది లైవ్​లో చూసి ఉండరు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి