iDreamPost

RR vs DC: వీడియో: అంపైర్​తో దాదా, పాంటింగ్ గొడవ.. ఇది లైవ్​లో చూసి ఉండరు!

  • Published Mar 29, 2024 | 2:11 PMUpdated Mar 29, 2024 | 2:11 PM

రాజస్థాన్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్​లో అంపైర్​తో గంగూలీ, పాంటింగ్ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకీ గొడవ జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్​లో అంపైర్​తో గంగూలీ, పాంటింగ్ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకీ గొడవ జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 29, 2024 | 2:11 PMUpdated Mar 29, 2024 | 2:11 PM
RR vs DC: వీడియో: అంపైర్​తో దాదా, పాంటింగ్ గొడవ.. ఇది లైవ్​లో చూసి ఉండరు!

క్రికెట్​ మ్యాచ్​లో గొడవలు సాధారణమే. ఒక టీమ్ ప్లేయర్లు ఇంకో టీమ్ ప్లేయర్లతో ఫైట్​కు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పుడప్పుడూ అంపైర్లతో ఆటగాళ్లు గొడవకు దిగడం కూడా చూస్తూనే ఉంటాం. అయితే అంపైర్లతో కోచింగ్ స్టాఫ్ ఫైట్ చేయడం ఎప్పుడూ చూసుండరు. కానీ అలాంటి గొడవకు ఐపీఎల్-2024 వేదికగా మారింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్​లో అంపైర్లతో గొడవపడ్డారు డీసీ కోచింగ్ బృందం. ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్, టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీలు ఫోర్త్ అంపైర్​తో వాదనకు దిగారు. మ్యాచ్ సమయంలో ఇది పెద్దగా ఎవరి దృష్టికి రాలేదు. మ్యాచ్ తర్వాత దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటీ గొడవ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు హెడ్ కోచ్ పాంటింగ్, డైరెక్టర్ గంగూలీ ఫోర్త్ అంపైర్​తో వాగ్వివాదానికి దిగారు. దీంతో డీసీ క్యాంప్ వేడెక్కింది. అంపైర్​తో తొలుత పాంటింగ్ వాదులాటకు దిగాడు. ఆ తర్వాత గంగూలీ అందులో కలుజేసుకున్నాడు. అక్కడ జరిగింది ముమ్మాటికీ తప్పు అంటూ దాదా, పాంటింగ్ అంపైర్​పై సీరియస్ అయ్యారు. దీంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. అయితే చివరికి ఫోర్త్ అంపైర్ వాళ్లిద్దర్నీ కన్విన్స్ చేశాడు. దీనంతటికీ కారణం సబ్​స్టిట్యూట్ ఫీల్డరే. ఈ మ్యాచ్​లో షిమ్రాన్ హెట్​మెయిర్​కు ఇంపాక్ట్ ప్లేయర్​గా బర్గన్​ను టీమ్​లోకి తీసుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే బర్గర్​ను డగౌట్​కు పంపించి.. అతడికి బదులుగా సబ్​స్టిట్యూట్​ ఫీల్డర్​గా రోమెన్ పావెల్​ను తీసుకుంది. దీని మీద పాంటింగ్, గంగూలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రూల్స్​కు విరుద్ధంగా 5 మంది ఓవర్సీస్ ప్లేయర్లను ఉపయోగిస్తున్నారంటూ గంగూలీ, పాంటింగ్ సీరియస్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదని.. ఫోర్త్ అంపైర్​తో గొడవకు దిగారు. అయితే దీని మీద అంపైర్ క్లారిటీ ఇచ్చారు. ప్లేయింగ్ ఎలెవన్​లోకి నలుగురు ఫారెన్ ప్లేయర్లను తీసుకున్నారని.. బర్గర్​కు బదులుగా పావెల్​ను సబ్​స్టిట్యూట్​గా మాత్రమే బరిలోకి దింపారని వివరించారు. దీంతో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన డీసీ ఓవర్లన్నీ ఆడి 173 పరుగులు చేయగలిగింది. ఆ టీమ్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాస్ బ్యాటింగ్​తో అదరగొట్టిన రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. మరి.. అంపైర్​తో దాదా, పాంటింగ్ గొడవపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి