iDreamPost

CSKను గెలిపిస్తున్న 2 కోట్ల ఆటగాళ్లు.. వీళ్ల ముందు 25 కోట్ల స్టార్క్ జుజుబీ!

  • Published Mar 27, 2024 | 5:50 PMUpdated Mar 27, 2024 | 5:50 PM

చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. అయితే ఆ టీమ్ సక్సెస్​లో ఇద్దరు రూ.2 కోట్ల ఆటగాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. అయితే ఆ టీమ్ సక్సెస్​లో ఇద్దరు రూ.2 కోట్ల ఆటగాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.

  • Published Mar 27, 2024 | 5:50 PMUpdated Mar 27, 2024 | 5:50 PM
CSKను గెలిపిస్తున్న 2 కోట్ల ఆటగాళ్లు.. వీళ్ల ముందు 25 కోట్ల స్టార్క్ జుజుబీ!

క్రికెటర్లపై ఐపీఎల్ కోట్ల వర్షం కురిపిస్తోంది. సత్తా ఉన్న ఆటగాళ్ల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా ఫ్రాంచైజీలు వెనుకాడటం లేదు. ఇంటర్నేషరనల్ స్టార్స్ మాత్రమే కాదు.. డొమెస్టిక్ ప్లేయర్లు కూడా క్యాష్ రిచ్ లీగ్ వేలంలో ఊహించని ధరకు అమ్ముడుపోయి ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే కోట్లు పెట్టేసి తోపు ఆటగాళ్లను తీసుకుంటే సరిపోదు.. వాళ్లు పెర్ఫార్మ్ చేయాలి. అప్పుడే ఆయా జట్లు వాళ్ల మీద పెట్టిన ఇన్వెస్ట్​మెంట్​కు ఓ మీనింగ్ ఉంటుంది. వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్ల మీద సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఎలాగైనా రాణించాలి, తమ మీద పెట్టిన రేట్​కు న్యాయం చేయాలనే ప్రెజర్ ఉంటుంది. దీంతో వాళ్లు ఫెయిలవుతుంటారు. అయితే ఆక్షన్​లో తక్కువ ధర పలికిన వారి మీద ఈ ఒత్తిడి ఉండదు. అందుకే వాళ్లు గ్రౌండ్​లో ఇరగదీస్తుంటారు. ఈసారి ఐపీఎల్​లో ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్స్ ఇలాగే తమ పెర్ఫార్మెన్స్​తో దుమ్మురేపుతున్నారు.

ఐపీఎల్-2024లో సీఎస్​కే వరుస విజయాలతో జోరు మీద ఉంది. తొలి మ్యాచ్​లో ఆర్సీబీని ఓడించిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్​లో పటిష్టమైన గుజరాత్ టైటాన్స్​ను చిత్తు చేసింది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో పాయింట్స్ టేబుల్​లో టాప్​లో ఉంది. పించ్ హిట్టర్ శివమ్ దూబె చెలరేగుతూ టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే సరిగ్గా గమనిస్తే చెన్నై గెలుపులో మరో ఇద్దరు ప్లేయర్లు ఇంపార్టెంట్​గా మారారు. వాళ్లే స్పిన్ ఆల్​రౌండర్ రచిన్ రవీంద్ర, పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్. ఓపెనర్​గా రెండు మ్యాచుల్లోనూ రచిన్ సక్సెస్ అయ్యాడు. బెంగళూరుతో మ్యాచ్​లో 15 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టుకు సూపర్బ్​ స్టార్ట్ అందించాడు. గుజరాత్ మీద కూడా 20 బంతుల్లో 46 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాదులు వేశాడు. ఈ రెండు మ్యాచుల్లో అతడు బంతితో పలు ఓవర్లు వేశాడు. వికెట్లు తీయకపోయినా పరుగులు కట్టడి చేస్తూ అపోజిషన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు.

స్పీడ్​స్టర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా సీఎస్​కే విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్​లో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. జీటీ మీద కూడా 2 వికెట్లతో సత్తా చాటాడు. చెన్నై సక్సెస్​లో కీలకంగా మారిన ఈ ఇద్దరు ప్లేయర్లకు వేలంలో దక్కిన మొత్తం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఆక్షన్​లో ముస్తాఫిజుర్​ను రూ.2 కోట్లకు, రచిన్​ను రూ.1.80 కోట్ల ధరకు సీఎస్​కే దక్కించుకుంది. ఇతర ఫ్రాంచైజీల నుంచి పోటీ లేకపోవడంతో వీళ్లను తక్కువ రేటుకే సొంతం చేసుకుంది. ఇప్పుడు వాళ్లే టీమ్​లో కీలకంగా మారారు. అదే కోల్​కతా నైట్ రైడర్స్​ను చూసుకుంటే మినీ వేలంలో రూ.24.75 కోట్ల రికార్డు ధరకు మిచెల్ స్టార్క్​ను తీసుకుంది. కానీ ఏం లాభం స్టార్క్ తొలి మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​పై 4 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో నెటిజన్స్ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు. రికార్డు ధర పెట్టి కొనుక్కున్న స్టార్క్ వేస్ట్ అని.. రచిన్, ముస్తాఫిజుర్ ముందు అతడు జుజుబీ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రచిన్, ముస్తాఫిజుర్ పెర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి