iDreamPost

IPL-2024 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధం.. పాల్గొనే సెలబ్రిటీలు వీరే!

IPL 2024 Closing Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 ఈరోజుతో ముగియనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.

IPL 2024 Closing Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 ఈరోజుతో ముగియనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.

IPL-2024 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధం.. పాల్గొనే సెలబ్రిటీలు వీరే!

రెండున్నర నెలల పాటు సాగిన ఐపీఎల్ సీజన్ 17 నేటి ముగియనుంది. ఈ ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 75 రోజుల పాటు సాగిన ఈ ఐపీఎల్ 2024లో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. ఒంటికాలిపై నిలబడి చూసేలా చేసిన మ్యాచ్ లకు కొదవలేదు. ఇలా ఎంతో హట్టహాసంగా సాగిన ఐపీఎల్ సీజన్ 17..నేటితో ముగియనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన ముగింపు వేడుకలకు సర్వం సిద్దమైంది. అలానే ఈ ముగింపు  కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 ఈరోజుతో ముగియనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కప్ గెల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.  కేకేఆర్, ఎస్ఆర్ హెచ్ జట్లు ఇప్పటి వరకు 27 సార్లు తలపడగా.. కేకేఆర్ 18 సార్లు, ఎస్ఆర్ హెచ్ 9 సార్లు విజయం సాధించాయి. ఇక పోతే.. ఈ సీజన్ లో ఎస్ఆర్ హెచ్ తో ఆడిన  రెండు మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చూస్తోంది. క్వాలిఫైయర్ 1మ్యాచ్ లో హైదరాబాద్ పై కోల్ కత్తా విజయం సాధించింది. అయితే క్యాలిఫైయర్2 లో రాజస్థాన్ రాయల్స్ పై ఎస్ఆర్ హెచ్ అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. దీంతో సగర్వంగా ఫైనల్ కి చేరి.. కోల్ కత్తాపై ప్రతికారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తోంది.

ఇలా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హాట్ హాట్ గా ఉంటే.. అంతకంటే ముందు జరిగే ముగిపు వేడుకులు ఇంకా గ్రాండ్ గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఎల్ 2024 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈసారి ముగింపు వేడుకల కలర్‌ఫుల్ ప్రోగ్రామ్‌ను ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ అందించనుంది. అలానే ముగింపు వేడుకలకు క్రికెట్ ప్రియులను ఉత్సాహపరిచేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.  అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ ఈ ముగింపు వేడుకల్లో పాల్గొనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ధృవీకరించింది. బ్యాండ్ మెయిన్ సింగర్ డాన్ రేనాల్డ్స్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.  ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్ లో 7 గంటలకు టాస్ వేయగా.. 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే అంతకంటే ముందు ఐపీఎల్ ముగింపు వేడుక సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకలో అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ ప్రత్యేక కచేరీని ప్రదర్శిస్తుంది. బిలీవర్ అనే ప్రసిద్ధ ఇంగ్లీష్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లుదు. ఈ సాంగ్ ను ఇమాజిన్ డ్రాగన్స్ పాడారు. ఆ ఫేమస్ సాంగ్ ను పాడిన ఈ టీమ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనుంది. అంతేకాక ఈ ఐపీఎల్ సీజన్ 17 ముగింపు వేడుకలకు పలువురు సెలబ్రిటీలు రానున్నట్లు సమాచారం. సినీ,రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి