iDreamPost

మహ్మద్ షమీతో సానియా మీర్జా పెళ్లంటూ వార్తలు! ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ఏమన్నాడంటే?

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ- టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తలపై ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించాడు. ఆయన ఏమన్నాడంటే?

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ- టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తలపై ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించాడు. ఆయన ఏమన్నాడంటే?

మహ్మద్ షమీతో సానియా మీర్జా పెళ్లంటూ వార్తలు! ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ఏమన్నాడంటే?

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ– టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. ఇద్దరికీ సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించాడు. ఈ విషయంపై ఆయన ఏమన్నాడంటే?

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ ప్రస్తుతం తన ఒంటరిగా జీవిస్తున్న విషయం తెలిసిందే. భార్యతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నాడు. గాయం కారణంగా టీమిండియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇంజ్యూరీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?  మహ్మద్ షమీ భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారట. ఈ గాసిప్ న్యూస్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షోయబ్ మాలిక్ పాక్ నటిని పెళ్లి చేసుకోవడంతో.. సానియా అతడికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె దుబాయ్ లో తన కొడుకుతో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న పుకార్లు వ్యాపించడంతో.. ఆ వార్తలపై తాజాగా స్పందించాడు సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా.

Sania Mirza

“సానియా మీర్జా, షమీ విషయంలో వచ్చే వార్తలన్నీ చెత్తవి. ఆ న్యూస్ లో ఎంతమాత్రమూ నిజం లేదు. అసలు ఇప్పటి వరకు సానియా అతడిని కలవనే లేదు”  అంటూ పుకార్లకు చెక్ పెట్టాడు. ఇక సానియా విషయానికి వస్తే.. హజ్ యాత్రకు వెళ్లిన సానియా.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేసింది. తాను మారుతున్నానని, ఏమైనా తప్పులు ఉంటే.. మన్నించాలని ఆ దేవుడిని ప్రార్థించింది. పవిత్ర యాత్ర చేపడుతున్న సందర్భంగా తనను గుర్తుంచుకోవాలని, ఒక మంచి మనిషిలా తిరిగొస్తానని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక షమీ-సానియా పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె తండ్రి స్పష్టం చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి