iDreamPost
android-app
ios-app

విరాట్ కోహ్లీకి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? హర్షిత్ రాణా రిప్లై వైరల్..

  • Published Jun 19, 2024 | 10:26 AM Updated Updated Jun 19, 2024 | 10:26 AM

విరాట్ కోహ్లీకి కూడా మయాంక్ అగర్వాల్ కు ఇచ్చినట్లుగా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? అన్న ప్రశ్నకు కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. అతడేమన్నాడంటే?

విరాట్ కోహ్లీకి కూడా మయాంక్ అగర్వాల్ కు ఇచ్చినట్లుగా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? అన్న ప్రశ్నకు కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. అతడేమన్నాడంటే?

  • Published Jun 19, 2024 | 10:26 AMUpdated Jun 19, 2024 | 10:26 AM
విరాట్ కోహ్లీకి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? హర్షిత్ రాణా రిప్లై వైరల్..

హర్షిత్ రాణా.. ఐపీఎల్ 2024 సీజన్ లో మారుమోగిన పేరు. ఈ టోర్నీలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ను అవుట్ చేసిన తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇస్తూ.. వైల్డ్ గా తన సెలబ్రేషన్స్ ను చేసుకున్నాడు. ఇది ఘటన అప్పట్లో వైరల్ గా మారింది. దానికి భారీ మూల్యం కూడా చెల్లించుకున్నాడు హర్షిత్ రాణా. అయితే తాాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అలాగే విరాట్ కోహ్లీకి కూడా ఇలాగే ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? అన్న ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2024 టైటిల్ ను కేకేఆర్ కైవసం చేసుకోడంలో ఆ జట్టు యంగ్ పేసర్ హర్షిత్ రాణాది కీలక పాత్ర. ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన అతడు 19 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక ఈ టోర్నీలో తన ప్రదర్శనతోనే కాకుండా.. తన ఓవర్ యాక్షన్ తో విమర్శలపాలైయ్యాడు. ఈ లీగ్ లో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి కాస్త వైల్డ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ ను బీసీసీఐ మందలించింది. మరోసారి ఇలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు అంటూ ఆ మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించింది. ఆ తర్వాత ఈ విధంగా ప్రవర్తించలేదు ఈ యంగ్ పేసర్.

కాగా.. తాజాగా శుభాంకర్ మిశ్రా పాడ్ కాస్ట్ లో హర్షిత్ రాణా ఈ విషయంపై మాట్లాడాడు..”మయాంక్ భయ్యా వికెట్ తీసిన తర్వాత నేను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు. బంతి గాల్లోకి లేచాక.. నేను అతడి దగ్గరి వెళ్లి, వికెట్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో అలా సరదాగా చేశాను. కెమెరామెన్ కూడా నావైపే ఫోకస్ చేశాడు. అయితే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నేను మయాంక్ భయ్యను కలిసి మిమ్మల్ని అగౌరవ పరిచే ఉద్దేశం లేదని సారీ చెప్పాను. అతడు కూడా మంచిగా మాట్లాడాడు” అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి కూడా ఇలాగే ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? అని హోస్ట్ ప్రశ్నించగా..

“నేను కావాలని ఏదీ చేయను.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కూడా నేను ఫ్లైయింగ్ కిస్ ఇస్తానని చాలా మంది ఎదురుచూశారు. నన్ను ఛాలెంజ్ కూడా చేశారు. అయితే నేను ఎన్నడూ విరాట్ కోహ్లీని టీజ్ చేయను. కోహ్లీ భయ్య పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కోహ్లీనే కాదు.. ప్రతీ ఒక్క ఆటగాడి పట్ల నాకు గౌరవం ఉంది” అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం అతడు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి హర్షిత్ రాణా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş