iDreamPost

Rohit Sharma: రోహిత్ తప్పుడు నిర్ణయం వల్లే భారత్​కు ఈ పరిస్థితి: రవిశాస్త్రి

  • Published Dec 28, 2023 | 4:05 PMUpdated Dec 29, 2023 | 12:43 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ తీసుకున్న ఓ నిర్ణయం వల్లే భారత్​కు ఈ పరిస్థితి తలెత్తిందన్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ తీసుకున్న ఓ నిర్ణయం వల్లే భారత్​కు ఈ పరిస్థితి తలెత్తిందన్నాడు.

  • Published Dec 28, 2023 | 4:05 PMUpdated Dec 29, 2023 | 12:43 PM
Rohit Sharma: రోహిత్ తప్పుడు నిర్ణయం వల్లే భారత్​కు ఈ పరిస్థితి: రవిశాస్త్రి

సఫారీ గడ్డ మీద జరిగిన టీ20, వన్డే సిరీస్​లో డామినేషన్ చూపించిన టీమిండియా.. టెస్టుల్లో మాత్రం వెనుకబడింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్​లో భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ మ్యాచ్​ మొదటి ఇన్నింగ్స్​లో టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (101) తప్ప ఎవరూ రాణించలేదు. రాహుల్​ను మినహాయిస్తే ఒక్క భారత బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆతిథ్య జట్టు ప్రస్తుతం 90.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులతో ఉంది. ఆఖరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్ (179 నాటౌట్)తో పాటు మర్కో యాన్సన్ (57 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​లో టీమిండియా వెనుకంజలో ఉండటానికి కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణమని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.

రోహిత్ చేసిన ఓ పొరపాటు వల్లే మొదటి టెస్టులో టీమిండియా సిచ్యువేషన్ ఇలా ఉందన్నాడు రవిశాస్త్రి. ‘రెండో రోజు లంచ్ బ్రేక్ టైమ్​కు ప్రొటీస్ టీమ్ 49/1 స్కోరుతో ఉంది. లంచ్ తర్వాత గేమ్ స్టార్ట్ అయినప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్​తో రోహిత్ బౌలింగ్ చేయించాడు. ఓపెనింగ్ స్పెల్​ వేసిన జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్​ను పక్కన పెట్టాడు. ఇది పూర్తిగా బెడిసికొట్టింది. సెషన్​ను మొదలుపెట్టే ముందు టాప్ బౌలర్లతోనే బౌలింగ్ చేయించాలి. నేను కోచ్​గా ఉన్నప్పుడు ఇదే చేశాం. కానీ సౌతాఫ్రికాతో రెండో సెషన్​ తొలి అర్ధ గంటలో టీమిండియా చేసిన అతిపెద్ద తప్పు ఇదే’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రెండో సెషన్ స్టార్టింగ్ స్పెల్ విషయంలో భారత్ పొరపాటు చేసిందన్నాడు.

rohit did a mistake

రోహిత్​తో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ తప్పకుండా ఈ విషయం మీద దృష్టి సారించాలని మంజ్రేకర్ సూచించాడు. బ్రేక్ టైమ్​లో వాళ్లిద్దరూ మాట్లాడుకొనే బుమ్రా, సిరాజ్​తో కాకుండా ప్రసిద్ధ్, శార్దూల్​తో బౌలింగ్ చేయించి ఉంటారని వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై సౌతాఫ్రికా వెటరన్ పేసర్ వెర్నాన్ ఫిలాండర్ కూడా రియాక్ట్ అయ్యాడు. బుమ్రాకు కాస్త రెస్ట్ ఇచ్చి తర్వాత బౌలింగ్ చేయించాలని రోహిత్, ద్రవిడ్ భావించి ఉంటారని అన్నాడు. కానీ టీమిండియా మాత్రం మంచి ఛాన్స్ మిస్ చేసుకుందన్నాడు. లంచ్ అనంతరం సౌతాఫ్రికా వేగంగా 42 రన్స్ రాబట్టుకొని తమ ఇన్నింగ్స్​కు ఊపు తెచ్చిందని ఫిలాండర్ తెలిపాడు. మరి.. బుమ్రా, సిరాజ్​ను కాదని ప్రసిద్ధ్, శార్దూల్​తో రెండో సెషన్​ను స్టార్ట్ చేయాలని రోహిత్ తీసుకున్న డెసిజన్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: MS Dhoni: అలా కూర్చోవడం చాలా బోరింగ్.. ఫ్యాన్స్ కోసం ఆ కష్టాన్ని భరిస్తున్నా: ధోని

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి