iDreamPost

OTT Web Series: నేహా శర్మ ఇల్లీగల్ వెబ్ సిరీస్ నుండి కొత్త సీజన్! ఈసారి ఇంకాస్త లోతుగా!

  • Published May 20, 2024 | 1:21 PMUpdated May 20, 2024 | 1:21 PM

చాలా వరకు ఇప్పుడు సినిమాలా కంటే కూడా వెబ్ సిరీస్ లను అందరూ చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో మంచి ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లు అన్నీ కూడా ఇప్పుడు సరికొత్త సీజన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక వెబ్ సిరీస్ సరికొత్త సీజన్ రాబోతుంది.

చాలా వరకు ఇప్పుడు సినిమాలా కంటే కూడా వెబ్ సిరీస్ లను అందరూ చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో మంచి ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లు అన్నీ కూడా ఇప్పుడు సరికొత్త సీజన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక వెబ్ సిరీస్ సరికొత్త సీజన్ రాబోతుంది.

  • Published May 20, 2024 | 1:21 PMUpdated May 20, 2024 | 1:21 PM
OTT Web Series: నేహా శర్మ  ఇల్లీగల్ వెబ్ సిరీస్ నుండి కొత్త సీజన్! ఈసారి ఇంకాస్త లోతుగా!

ఓటీటీ లో సిరీస్ లకు ఆదరణ బాగా పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఎన్నో సిరీస్ లు ప్రేక్షకులను ఆదరించగా.. ఇప్పుడు ఆయా సిరీస్ లకు సరికొత్త సీజన్స్ రాబోతున్నాయి. ప్రేక్షకులు కూడా ఆయా సిరీస్ ల కొత్త సీజన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు ఓటీటీ లో ఉన్న అన్ని బ్లాక్ బస్టర్ సిరీస్ లకు కూడా సరికొత్త సీజన్స్ ను అనౌన్స్ చేసారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడు మరొక సూపర్ హిట్ సిరీస్ కు సరికొత్త సీజన్ రాబోతుంది. ఆ సిరీస్ మరేదో కాదు.. నేహా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఇల్లీగల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ సరికొత్త సీజన్ ను.. స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడో.. ఏ ప్లాట్ ఫార్మ్ లో రాబోతుందో చూసేద్దాం.

ఇల్లీగల్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని… ఇప్పుడు మూడవ సీజన్ రాబోతుంది. మొదటి రెండు సీజన్స్ కు మంచి ఆదరణ లభించడంతో ఇక ఇప్పుడు మూడవ సీజన్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సిరీస్ లో నేహా శర్మ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ లో ఈ సిరీస్ రెండు సీజన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి, ఎందుకంటే ఇప్పుడు ఈ సిరీస్ మూడవ సీజన్ కూడా రాబోతుంది. ఈ సీజన్ పై అందరికి భారీగా అంచనాలు నెలకొన్నాయి. మే 29 నుంచి ఇల్లీగల్ సిరీస్ మూడవ సీజన్ ను జియో సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. స్వయంగా ఈ జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఏ ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. పైగా ఈ సీజన్ ను హిందీతో పాటు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠి, బెంగాలీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ సిరీస్ లో నేహాతో పాటు.. పియూష్ మిశ్రా, అక్షయ్ ఒబెరాయ్, నీల్ భూపాలం, జీన్ మారీ ఖాన్, అషీమా వర్దన్, ఐరా దూబే, ఆయుష్మాన్ మల్హోత్రా ముఖ్య పాత్రలు పోషించారు. ఇల్లీగల్ సిరీస్ మూడవ సీజన్ కు షాహిర్ రాజా దర్శకత్వం వహించారు. ఇక ఇల్లీగల్ సిరీస్ మొదటి సీజన్ 2020 లో వచ్చింది. ఆ సిరీస్ ఊహించని విధంగా హిట్ కావడంతో.. 2021 లో రెండవ సీజన్ ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లకు, ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. మూడవ సీజన్ ను కూడా విడుదల చేయనున్నారు .. మరి ఈ సిరీస్ ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఇల్లీగల్ సిరీస్ మూడవ సీజన్ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి