iDreamPost

ఆ పార్టీ కోసం ప‌ని చేయ‌నుః ఎన్నికల వ్యూహ క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌

ఆ పార్టీ కోసం ప‌ని చేయ‌నుః ఎన్నికల వ్యూహ క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌

దేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పికే)అంటే..సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి సుపరిచితుడే. రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల నుంచి ప్ర‌ధాన మంత్రి వ‌ర‌కు అందరికి బాగా తెలిచిన వ్య‌క్తే…దేశంలో ప్ర‌ధాని మోడీతో పాటు..వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో క‌లిసి ప‌ని చేసిన ప్ర‌శాంత్ కిశోర్‌…మ‌రో కొంత మంది నేత‌ల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. పికేతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతాయి. అందుక‌నుగుణంగా ఆయనను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకుంటుంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే మధ్యప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌ను కోరింది. కానీ ఆయన అందుకు నిరాక‌రించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థ‌న‌ను పికే తిరస్కరించారు. జ్యోతిరాదిత్య సింథియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విడిపోయి…బిజెపిలో చేరారు. దీంతో అక్క‌డ దాదాపు 20 ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నిక‌లు ఇప్ప‌టికే జ‌ర‌గాల్సి ఉండ‌గా..లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడే లాక్‌డౌన్ నుంచి స‌డ‌లింపులు పెరిగాయి. అలాగే మ‌రోవైపు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మాయ‌త్తం అయింది. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ సందర్భంగా ప్రశాంత్‌ కిషోర్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘నాకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కమల్ నాథ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భావించారు. వారు నన్ను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సహకరించాలని కోరారు. కాని నేను దానికి అంగీకరించలేదు. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ కోసం పనిచేయలేనని స్పష్టంగా చెప్పాను’’ అన్నారు.

2014 ఎన్నికల్లో తొలిసారి ప్రశాంత్‌ కిషోర్‌ నరేంద్ర మోడీ కోసం పని చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. అయితే తరువాత అమిత్ షాతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన బిజెపికి దూరమయ్యారు. అలాగే బీహార్‌లో నితీష్ కుమార్ ప్ర‌భుత్వాన్ని మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి కూడా ప్ర‌శాంత్ కిశోర్ ఎన‌లేనిది. అందుకే నితీష్ కుమార్ త‌న పార్టీ జెడియు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ప్ర‌శాంత్ కిశోర్‌కు ఇచ్చారు. అయితే త‌రువాత నితీష్‌, ప్ర‌శాంత్ కిషోర్‌కు మ‌ధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎన్ఆర్‌సి, సిఎఎ వంటి అంశాలైన‌ప్పుడు వివాదం ముదిరింది. అప్పుడు జెడియు నుంచి ప్ర‌శాంత్‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు నితీష్ కుమార్ ప్ర‌క‌టించారు. దీనికి ప్ర‌శాంత్ కిశోర్ నేనే రాజీనామా చేస్తాన‌ని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్‌ కిషోర్‌.. అరవింద్ కేజ్రీవాల్ కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్నిసాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి కోసం.. తమిళనాడులో డిఎంకె నేత స్టాలిన్ కోసం పని చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి