iDreamPost

లోక్‌సభ ఎన్నికల్లో BJP తొలి విజయం! ఫలితాలు రాకముందే విజయం ఎలా సాధ్యమైందంటే?

BJP Win: 2024 పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మే 13వ తేదీతో ఎన్నికల పోలింగ్ ముగియనుండగా, జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అంతకంటే ముందే బీజేపీ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మరి.. ఎలా సాధ్యమైందంటే..

BJP Win: 2024 పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మే 13వ తేదీతో ఎన్నికల పోలింగ్ ముగియనుండగా, జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అంతకంటే ముందే బీజేపీ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మరి.. ఎలా సాధ్యమైందంటే..

లోక్‌సభ ఎన్నికల్లో BJP తొలి విజయం! ఫలితాలు రాకముందే విజయం ఎలా సాధ్యమైందంటే?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే తొలి విడద పోలింగ్ ఏప్రిల్ 19 తేదిన జరిగిన సంగతి తెలిసిందే. మరికొన్ని విడతల్లో దేశ వ్యాప్తంగా లోకస్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువనున్నాయి. అయితే ఈలోపే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఖాతాలో తొలి విజయం నమోదైంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం పొందింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  లోక్ సభ ఎన్నికల సందడి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తొలి విడత పోలింగ్ ముగియగా.. మరికొన్ని రాష్ట్రాల్లో నామినేషన్ల  ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నీలేష్ కుంబానీ నామినేషన్ పత్రాలపై చేసిన సంతకంలో వ్యత్యాసను రిటర్నింగ్ అధికారి గుర్తించారు. ఆ కారణంతో నీలేష్ నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి తిరష్కరించారు. అలానే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన ఇద్దరు కూడా తమ నామినేషన్ ను ఉపసంహించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక మిగిన బీజేపీ అభ్యర్థి  ముఖేస్ దలాల్ విజయం ఖాయమైంది.

గుజరాత్ రాష్ట్రం సూరత్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరష్కరణకి గురి కావడం, మిగిలిన వారు ఉపసంహరించుకోవడంతో.. బీజేపీ అభ్యర్థి దలాల్ ఒక్కరే రేసులో మిగిలారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందారు. ఎన్నిక ఫలితాలు ఇంకా వెలువడక ముందే గుజరాత్ లో బీజేపీ ఖాత  కొట్టిందని స్పష్టమవుతుంది. గుజరాత్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా సూరత్ పార్లమెంట్ ను  కాంగ్రెస్ కి కేటాయించారు. ఈ రాష్ట్రంలోని 26 ఎంపీ స్థానాలకుగాను కాంగ్రెస్ 24 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, ఆప్ 2 స్థానాల్లో అభ్యర్థులను దింపింది.  భావ్ నగర్, భరూచ్ లలో ఆప్ తమ అభ్యర్థులను బరిలో దింపింది. మొత్తంగా ఎన్నికల వేడి సాగుతున్న వేళా.. అందరి కంటే ముందే..బీజేపీ తొలి విజయాన్ని ఖాతాల్లో వేసుకుంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి