మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నాయకుడు కూల్చివేస్తానని బెదిరించాడు. అనుకున్నంత పని చేస్తాడుకూడా. ఒక పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను పోగేసి, వేరే పార్టీ స్పాన్సర్ షిప్, భరోసాతో తన ప్రభుత్వానికే మరణశాసనం రాస్తున్నాడు. అంతేకాదు, అసలు శివసేన పార్టీయే నాదంటున్నాడు. అతని పేరు ఏక్ నాథ్ షిండే. ఇలాంటి రాజకీయ తిరుగుబాటు కొత్తదేమీకాదు. ఎన్టీరామావుకు వెన్నుపోటు నుంచి మధ్యప్రదేశ్ సింధియా వరకు రాజకీయ తిరుగుబాట్లు, వెన్నుపోట్లు చాలానే చూశాం. 2020లో జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేశాడు. కొంతమంది ఎమ్మెల్యేలను […]
రాజ్యసభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం భారీ స్థాయిలో కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.జ్యోతిరాదిత్య సింధియా భాటలోనే రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ నడవనున్నాడని ఊహాగానాలు షికారు చేస్తున్న సమయంలో రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై విశ్వాసాన్ని ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. జూన్ 19 న రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తారని రాజస్థాన్ […]
దేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పికే)అంటే..సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి సుపరిచితుడే. రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాన మంత్రి వరకు అందరికి బాగా తెలిచిన వ్యక్తే…దేశంలో ప్రధాని మోడీతో పాటు..వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పని చేసిన ప్రశాంత్ కిశోర్…మరో కొంత మంది నేతలతో కలిసి పని చేస్తున్నారు. పికేతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతాయి. అందుకనుగుణంగా ఆయనను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంటుంది. ఈ నేపథ్యంలో […]
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దాదాపు నెల రోజుల తర్వాత మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తన ప్రభుత్వంలోని ఐదుగురు కు మంత్రి పదవులు కేటాయించారు. రాజ్ భవన్ లో గవర్నర్ లాల్జి టాండన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులగా బాధ్యతలు చేపట్టిన వారిలో నరోత్తం మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్, తులసి శిలావత్, గోవింద్ సింగ్ రాజ్ పుత్ ఉన్నారు. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ తిరుగుబాటు నేత […]
మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు ఈ రోజు తెరపడింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన 15 నెలలకే ముగిసింది. మళ్లీ శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ కొలువుతీరనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినా.. అవకాశాలు మాత్రం మూసుకుపోలేదని చెప్పవచ్చు. మరో ఆరు నెలల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు దారుంది. అయితే ఆ దారి.. మధ్య […]
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కి షాక్ ఇస్తూ బెంగుళూరు క్యాంపులో ఉన్న జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ప్రజాపతి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ బలం 92 కి పడిపోయింది. సభలో ప్రస్తుత బలబలాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 22 మంది, బిజెపికి చెందిన ఒక సభ్యుడి రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 207 కి పడిపోయింది. దీనితో ప్రస్తుత బలబలాలను […]
మధ్యప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ రేపు సాయంత్రం 5 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్ట్ తేల్చిచెప్పింది. బలపరీక్ష సమయంలో ఎలాంటి ప్రలోభాలు జరగకుండా మొత్తం ప్రక్రియను వీడియో లో రికార్డ్ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బలపరీక్ష సమయంలో సభ్యులంతా చేతులు పైకెత్తడం ద్వారా సభ్యులకు కౌటింగ్ నిర్వహించి బలపరీక్షలో ఎవరు నెగ్గారనే విషయాన్ని నిర్ధారించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. కాగా, జ్యోతిరాధిత్య సింధియాకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు 16 మంది […]
మధ్యప్రదేశ్ లో కమలనాధ్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో శాసనసభలో తమ బలం నిరూపించుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాధ్ కి గవర్నర్ లాల్జీ టాండన్ వార్నింగ్ ఇచ్చారు. లేనిపక్షంలో కమల్ నాధ్ ప్రభుత్వానికి బలం లేదని భావించాల్సి ఉంటుందని గవర్నర్ హెచ్చరించారు. కాగా సోమవారంలోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని లేఖ ద్వారా స్పీకర్ కు గవర్నర్ సూచించినప్పటికీ స్పీకర్ మాత్రం ఈ నెల 26 వరకు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న […]
మధ్య ప్రదేశ్ రాజకీయాలు తుది అంకానికి చేరుకున్నట్లే కనిపిస్తున్నాయి. సోమవారం నాడు అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని,గవర్నర్ లాల్జీ టాండన్ స్పీకర్ ప్రజాపతిని ఆదేశించారు. కాగా ప్రజాపతి ఈరోజు బలపరీక్ష నిర్వహిస్తారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ లో బలపరీక్ష అంశం మాత్రం లేదు. దీంతో నేడు బలపరీక్ష జరిగే అవకాశం లేదన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో నడుస్తున్నాయి.స్పీకర్ ప్రజాపతి గవర్నర్ ఆదేశాలను పాటిస్తాడా లేక పెడచెవిన పెడతారా అనే విషయంపై […]
మధ్యప్రదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వయంకృత అపరాధమే కారణం అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ విషయంలో అన్ని వేళ్ళు కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధతనే ఎత్తి చూపుతున్నాయి. కష్టకాలంలో పార్టీలో సంస్థాగతంగా స్థానిక యువనాయకత్వాన్ని ప్రోత్సహించి పార్టీకి జవసత్వాలు కల్పించాల్సింది పోయి, ఎంతసేపటికి భజనపరులకే ప్రాధాన్యమిస్తూ వారినే అందలం ఎక్కించడం వల్లనే పార్టీ కి ఈ దుస్థితి దాపురించిందని సాక్షాత్తు కొందరు కాంగ్రెస్ సీనియర్ […]