iDreamPost

తండ్రి కూతుళ్ల బిజినెస్ వేట.. DMartతో సహా టాప్ కంపెనీలన్నీ వెనక్కి

కార్పోరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ కూతురు ఇషా రిలయన్స్ రిటైల్ వ్యాపార పగ్గాలు చేపట్టిన తర్వాత రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. డీమార్ట్ తో సహా టాప్ కంపెనీలన్నీ వెనక్కి నెట్టివేయబడ్డాయి.

కార్పోరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ కూతురు ఇషా రిలయన్స్ రిటైల్ వ్యాపార పగ్గాలు చేపట్టిన తర్వాత రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. డీమార్ట్ తో సహా టాప్ కంపెనీలన్నీ వెనక్కి నెట్టివేయబడ్డాయి.

తండ్రి కూతుళ్ల బిజినెస్ వేట.. DMartతో సహా టాప్ కంపెనీలన్నీ వెనక్కి

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని రారాజు. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ ఒకరు. కార్పోరేట్ దిగ్గజమైన ముఖేష్ అంబానీ తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను సృష్టించి నయా చరిత్రకు నాంది పలికారు. నేడు ఆసియా కుబేరుడిగా ముఖేష్ అంబానీ కీర్తి గడించారంటే దాని వెనకాల ఆయన చేసిన అసాధారణమైన కృషి దాగుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఆయిల్,గ్యాస్ వ్యాపారాలతో పాటు టెలికాంరంగంలో కూడా తిరుగులేని శక్తిగా ఎదిగారు. తన వ్యాపార పగ్గాలను కూతురుకు అప్పగించిన అనంతరం బిజినెస్ లో తండ్రీ కూతుళ్ల వేట మొదలైంది.

వ్యాపారం రంగంలో ముఖేష్ అంబానీ ఆయన కూతురు ఇషా వేటను కొనసాగిస్తున్నారు. జియో టెలికాంరంగంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇషాకు వ్యాపార పగ్గాలు అప్పగించిన తర్వాత రిటైల్ వ్యాపారం సైతం అంబానీకి కాసులు కురిపిస్తోంది. రిలయన్స్ గ్రూప్ కింద రిటైల్ వ్యాపారాన్ని ఇషా అంబానీ నేతృత్వంలో రిలయన్స్ రిటైల్ పేరిట కొనసాగుతోంది. ఇటీవల కంపెనీ విడుదల చేసిన మార్చి త్రైమాసిక ఫలితాల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ అమ్మకాల విలువ ఏకంగా రూ.3 లక్షల కోట్లను తాకింది.

దీంతో దిగ్గజ కంపెనీలన్నీ వెనక్కి నెట్టివేయబడ్డాయి. ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, డీమార్ట్, నెస్లే, బ్రిటానియా, టాటా కన్జూమర్, గోద్రేజ్ కన్జూమర్ వంటి కంపెనీలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ షేరులో రిలయన్స్ రిటైల్ విలువ ఒక్కో షేరుకు రూ.1,593కి వస్తుంది. రిటైల్ వ్యాపారంలో రిలయన్స్ కంపెనీ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రంగాల్లో తన విస్తరణను వేగంగా కొనసాగిస్తోందని బ్రోకరేజ్ వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి