iDreamPost

వీడియో:ప్రమాదంలో గాయపడ్డ సీఎం మమతా బెనర్జీ..!

CM Mamata was Injured: ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ టైమ్ బ్యాడ్ గా నడుస్తుందని అంటున్నారు. జనవరి నుంచి ఆమెకు వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

CM Mamata was Injured: ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ టైమ్ బ్యాడ్ గా నడుస్తుందని అంటున్నారు. జనవరి నుంచి ఆమెకు వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

వీడియో:ప్రమాదంలో గాయపడ్డ సీఎం మమతా బెనర్జీ..!

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నిక హడావుడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష నేదలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారం చేస్తున్నారు.  ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మొదటి దశ, రెండో దశ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ముఖ్యపార్టీ అధినేతలు పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎండలు సైతం లెక్కచేయకుండా ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ లో బయలు దేరబోతున్న సందర్భంగా ఆమెకు ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ లోకి వెళ్లిన తర్వాత కాలు స్లిప్ అయి కిందపడిపోయారు. ఈ క్రమంలోనే ఆమె కాలుకు స్వల్ప గాయం అయ్యింది. వివరాల్లోకి వెళితే..

ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. మరోవైపు నేతల ప్రచారాల్లో మునిగిపోతున్నారు. దీంతో పలువురు నేతలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి స్వల్ప గాయం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు తృణముల్ కాంగ్రెస్ అధినేత మమత బెనర్జీ బయలుదేరారు. హెలికాప్టర్ ఎక్కిన తర్వాతో లోపలికి వెళ్లే సమయంలో ఆమె కాలు స్లిప్ అయ్యింది. దీంతో మమతా బెనర్జీ కింద పడిపోవడంతో కాలుకు గాయమైంది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు సాయమందించి కాలుకి ప్రథమ చికిత్స చేశారు. తర్వాత మమత ఎన్నికల ప్రచారం కోసం అసన్నోల్ కు బయలుదేరారు.

గత కొంత కాలంగా మమతా బెనర్జీని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఆ మద్య మమతా బెనర్జీకి నుదటి గాయానికి సంబంధించిన ఫోటోని టీఎంసీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయడంతో అందరూ కంగారు పడ్డారు. కాళీఘాట్ లోని తన నివాసమంలో ఆమె గయాపడ్డారు. ఇంట్లో వ్యాయామం చేస్తుండగా స్లిప్ అయి కిందపడిపోవడంతో ఆమెకు ఈ గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. అంతకు ముందు జనవరి నెలలో బర్దమాన్ జిల్లా నుంచి తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మమత నుదిలపై భాగంలో గాయం అయ్యింది. వర్షం పడుతున్న క్రమంలో కారు డ్రవైర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందించారు. తాజాగా మమతాకు మరోసారి ప్రమాదం జరగడంతో ఆమె బయలు దేరే వేళ బాగాలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి