iDreamPost

ఇండియాలో పేదరికం తగ్గిపోయిందన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman On Poverty: దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకొంది. అధికార ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే అధికార పార్టీ గత పదేళ్లలో తాము చేసిన సంక్షేమం గురించి కూడా చెప్పుకుంటున్నారు.

Nirmala Sitharaman On Poverty: దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకొంది. అధికార ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే అధికార పార్టీ గత పదేళ్లలో తాము చేసిన సంక్షేమం గురించి కూడా చెప్పుకుంటున్నారు.

ఇండియాలో పేదరికం తగ్గిపోయిందన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇరు పార్టీలు, హామీలు- తాయిలాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తాము ఏం చేయబోతున్నారో చెప్తూ ప్రజల్లోకి వెళ్తుంటే.. అధికార పార్టీ మాత్రం చేయబోయే విషయాలు మాత్రమే కాకుండా.. గతంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి కూడా చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పేదరికం తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు.

నిర్మలా సీతారామన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎద్దేవా చేశారు. వాళ్లు వాగ్దానాలు మాత్రమే ఇస్తారని.. వాటిని అమలు చేయరు అంటూ వ్యాఖ్యానించారు. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చూపించిందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు వల్ల అభివృద్ధి జరగడం మాత్రమే కాదు. దేశంలో పేదరికం కూడా తగ్గిందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. కరోనాలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా దేశంలో 25 కోట్ల మందిని పేదరికం కోరల నుంచి విముక్తులను చేశామన్నారు. విద్య, వైద్యం, ఆహార రంగాల్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్లే దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని వ్యాఖ్యానించారు.

దేశ నాయకుడైన రాహుల్ గాంధీ పూర్వీకులు కూడా చేయలేని పనిని.. మోదీ సర్కార్ చేసి చూపించిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ వల్ల దేశ ప్రజల జీవితాలు మారిపోలేదని చెప్పారు. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఏటా లక్ష రూపాయలు ఇచ్చుకుంటో పోయినంత మాత్రానా పేదరింక అంతం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీ వాగ్దానం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతుల్లో కనీసం 50 శాతం రైతులకు కూడా సహాయ పడదని చెప్పారు. కానీ, మోదీ సర్కార్ మాత్రం రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో రైతులను వేధిస్తే.. బీజేపీ మాత్రం రైతుల జీవితాలను బ్యాలెన్స్ చేసేందుకు కృషి చేసిందన్నారు.

అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అంటూ మోదీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయన్నారు. రక్షణ రంగంలో విదేశాలకు చేసే ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయన్నారు. అలాగే భారత్ లో సంస్థలను ఏర్పాటు చేసి, మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ పెట్టే ఎంటర్ పెన్యూర్స్ ని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఇండియాలో అయితే ఇక్కడున్న మ్యాన్ పవర్, స్కిల్డ్ యూత్, కాస్ట్ కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుందన్నారు. మోదీ సర్కార్ గత పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధికి మ్యాచ్ కారని ప్రతిపక్షాలకు కూడా తెలుసంటూ ఎద్దేవా చేశారు. భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి