iDreamPost

OTT లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ సీజన్ 2 స్టార్ట్ అయింది.. ఇప్పుడు తెలుగులో కూడా..

  • Published Jun 18, 2024 | 1:34 PMUpdated Jun 18, 2024 | 1:34 PM

OTT New Web Series: హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ రెండవ సీజన్ మొదలైపోయింది. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలను చూసేద్దాం.

OTT New Web Series: హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ రెండవ సీజన్ మొదలైపోయింది. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలను చూసేద్దాం.

  • Published Jun 18, 2024 | 1:34 PMUpdated Jun 18, 2024 | 1:34 PM
OTT లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ సీజన్ 2 స్టార్ట్ అయింది.. ఇప్పుడు తెలుగులో కూడా..

గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. వరల్డ్ వైడ్ గా ఈ బాగా ఫేమస్ అయింది. అయితే 2019 లో ఈ సిరీస్ ను ఎండ్ చేసేసిన తర్వాత.. 2022 లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అనే మరొక కొత్త సిరీస్ వచ్చింది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు ప్రీక్వెల్ గా తెరకెక్కింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు ఎలా అయితే ఆదరణ లభించిందో.. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కు కూడా అదే రేంజ్ లో ఆదరణ లభించింది. ఇక ఇపుడు ఈ సిరీస్ రెండవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పైగా ఈసారి తెలుగులో కూడా అందుబాటులో ఉంది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి.

జూన్ 17 నుంచి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. టార్గేరియన్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న సమస్యల నేపథ్యంలో ఈ సిరీస్ కొనసాగనుంది. మొదటి సీజన్ లో డేమన్ టార్గేరియన్, అలిసెంట్ హైటవర్, రెనేరా టార్గేరియన్, రెనేరిస్ టార్గేరియన్, ఒట్టో హైటవర్ క్యారెక్టర్స్ ను పరిచయం చేశారు. ఒక్కో ఎపిసోడ్ ముందుకు కదిలే కొద్దీ.. క్యారెక్టర్స్ అన్ని కూడా మైండ్ లో ఆటోమాటిక్ గా రన్ అయిపోతూ ఉంటాయి. ఇక ఈ సీజన్ కూడా అలానే ఉండబోతుంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచి కూడా డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్లిపోయారు. ఈ ఎపిసోడ్ ను బట్టి చూస్తే.. ఈ సీజన్ లాస్ట్ సీజన్ కంటే కూడా.. ఇంకాస్త వైలెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ సిరీస్ ప్రస్తుతం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా తెలుగులో కూడా ఈ సీజన్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేయొచ్చు. ఒరిజినల్ లాంగ్వేజ్ , తెలుగుతో పాటు.. తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో కూడా ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. ఇక హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ మొదటి సీజన్ మొత్తం పది ఎపిసోడ్స్ ఉండగా . రెండవ సీజన్ ఎనిమిది ఎపిసోడ్స్ ఉంది. ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా ఒకేసారి రిలీజ్ చేయకుండా.. వారానికి ఒక ఎపిసోడ్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కాబట్టి ఎంచక్కా ఈ సిరీస్ ను చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ టైప్ ఆఫ్ వార్ బేస్డ్ చిత్రాలలో ఎవరు ఎప్పుడు విలన్ అవుతారో.. ఎవరు ఎప్పుడు హీరో అవుతారా , ఎవరి కథ ఎప్పుడు ముగిసిపోతుందో చివరి వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి