iDreamPost

Harom Hara OTT: హరోం హర మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jun 18, 2024 | 11:28 AMUpdated Jun 18, 2024 | 11:28 AM

దాదాపు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. లేదా థియేటర్ లో రిలీజ్ అయినా రోజున ఆయా సినిమాల ఓటీటీ పార్ట్నర్స్ గురించి విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ చూసేద్దాం.

దాదాపు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. లేదా థియేటర్ లో రిలీజ్ అయినా రోజున ఆయా సినిమాల ఓటీటీ పార్ట్నర్స్ గురించి విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ చూసేద్దాం.

  • Published Jun 18, 2024 | 11:28 AMUpdated Jun 18, 2024 | 11:28 AM
Harom Hara OTT: హరోం హర మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

థియేటర్ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు.. ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. దాదాపు కొత్తగా థియేటర్ లో రిలీజ్ అయినా అన్ని సినిమాలకు ఇప్పటికే ఓటీటీ పార్ట్నర్స్ లాక్ అయిపోయాయి. ఇక థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఆయా సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ అనౌన్స్ చేయడం మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఇక తాజాగా థియేటర్ లో సందడి చేస్తున్న సినిమా.. సుధీర్ బాబు నటించిన “హరోం హర”. ఈ సినిమా మే 31న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లోకి రాబోతుందో చూసేద్దాం.

సుధీర్ బాబు నటించిన “హరోం హర” చిత్రానికి ప్రస్తుతం థియేటర్స్ లో .. మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సుదీర్ బాబుతో పాటు మాళవిక శర్మ, సునీల్, జయ ప్రకాష్, రవికాలే, అర్జున్ గౌడ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఎటువంటి అంచనాలు లేకుండా.. థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఇప్పుడు ప్రేక్షకులలో మాత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటుంది. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడు పోయాయట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇక హరోం హర సినిమా కథ విషయానికొస్తే.. ఆంధ్రపద్రేశ్, తమిళనాడు, కర్ణాటక బోర్డర్ లో కుప్పం అనే ప్రాంతం ఉంది. ఈ ఊరిలో తిమ్మారెడ్డి, అతడి తమ్ముడు బసవ, కొడుకు శరత్ రెడ్డి లదే పెత్తనం. ఊరిలో ప్రజలందరికి కూడా వారంటే చాలా భయం. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలోకి ఎంటర్ అవుతాడు సుధీర్ బాబు. అతను అక్కడ ఓ కాలేజ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ పడడంతో కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాడు. అతనితో పాటు తన ఫ్రెండ్ కానిస్టేబుల్ పళని స్వామి కూడా సస్పెండ్ అవుతాడు. అయితే అతని దగ్గర ఓ గన్ ఉంటుంది. దానితో పాటు ఓ బ్లు ప్రింట్ కూడా ఉంటుంది. ఇక సుధీర్ తన తెలివితేటలతో ఓ గన్ ను కూడా తయారు చేస్తాడు. అలాగే ఉద్యోగం పోడానికి కారణం అయినా శరత్ రెడ్డితో కూడా చేతులు కలుపుతాడు. అసలు కథ ఏంటి ! సుధీర్ కు ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి