iDreamPost

ఉద్యోగులకు పండగే.. జూన్ లో వరుసగా 3 రోజులు సెలవులు!

Good News For Employees- Three Days Holidays: ఉద్యోగులకు బైక్, బోనస్లు ఎంత ఆనందాన్ని ఇస్తాయో.. సెలవులు కూడా అంతే ఆనందాన్ని అందిస్తూ ఉంటాయి. అందుకే ముందు నుంచే ఈ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి అని చూసుకుంటారు. అలాంటి ఉద్యోగులకు ఇప్పుడు వరుసగా మూడ్రోజుల సెలవలు వచ్చేస్తున్నాయి.

Good News For Employees- Three Days Holidays: ఉద్యోగులకు బైక్, బోనస్లు ఎంత ఆనందాన్ని ఇస్తాయో.. సెలవులు కూడా అంతే ఆనందాన్ని అందిస్తూ ఉంటాయి. అందుకే ముందు నుంచే ఈ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి అని చూసుకుంటారు. అలాంటి ఉద్యోగులకు ఇప్పుడు వరుసగా మూడ్రోజుల సెలవలు వచ్చేస్తున్నాయి.

ఉద్యోగులకు పండగే.. జూన్ లో వరుసగా 3 రోజులు సెలవులు!

సొంత వ్యాపారం చేసుకుంటూ.. తనకు నచ్చినట్లు తాను వెకేషన్స్ కి వెళ్లే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. దాదాపుగా అంతా ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని పోషిస్తూ ఉండే వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లు ఏ అవసరం వచ్చినా కచ్చితంగా సెలవు తీసుకోవాల్సిందే. ఉద్యోగులు అంటే తెలిసిందే కదా.. కచ్చితంగా వరుస సెలవులు అంటే ఏ కంపెనీ అయినా అబ్జెక్షన్ పెడుతుంది. అందుకే పండగలు, వీకెండ్స్ వచ్చినప్పుడు ఏదైనా టూర్, వెకేషన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే జూన్ నెలలో అలాంటి ఒక అవకాశం రెడీగా ఉంది. మీరు గనుక వెకేషన్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని కచ్చితంగా వాడుకోవాల్సిందే. ఎందుకంటే వరుసగా 3 రోజుల సెలవులు అంటే మాటలు కాదు కదా?

ఒక సెలవు విలువ తెలియాలి అంటే కచ్చితంగా ఒక ఉద్యోగిని అడగాల్సిందే. వెకేషన్ కి వెళ్లాలి అంటే సెలవులు దొరక్క ఆగిపోతున్నారా? పైగా జూన్లో ఎలాంటి సెలవులు రావడం లేదు అని దిగులు పడుతున్నారా? అయితే ఈ మంత్ లో మీకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఉంది. అది గనుక మీరు వాడుకుంటే ఏకంగా వరుసగా మూడ్రోజులు సెలవులు ఎంజాయ్ చేయచ్చు. అది కూడా జూన్ రెండోవారం ఎండింగ్ అండ్ మూడోవారం స్టార్టింగ్ లో. ఈ సెలవలు గురించి ఇంకా ఎవరూ ఎలాంటి ప్లాన్సింగ్స్ చేసుకున్నట్లు కనిపించడం లేదు. ఒకసారి క్యాలెండర్ ఓపెన్ చేసి జూన్ నెల చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

బక్రీద్ సందర్భంగా:

ఈ జూన్ నెలలో బక్రీద్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బక్రీద్ వీకెండ్ తో కలిసి వచ్చింది. బక్రీద్ ఈసారి జూన్ 16 ఆదివారం వచ్చింది. అయితే బక్రీద్ 16న ప్రారంభమయ్యి.. 17న సాయంత్రం ముగుస్తుంది అంటున్నారు. అంటే సోమవారం కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కి ఇది వెకేషన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే.. జూన్ 15, 16, 17 రోజుల్లో ఒక స్మాల్ ట్రిప్ వేసి రావచ్చు. లేదంటే ఫ్రెండ్స్- ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయచ్చు.

వీకెండ్ ఎంజాయ్ చేయాలి అంటే ఇప్పుడు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. అయితే నాన్ ఐటీ వాళ్లు కూడా ఈ వీకెండ్ ని గట్టిగానే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే శనివారం మాత్రం లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుంటే మీరు కూడా మూడ్రోజులు సెలవులు ఎంజాయ్ చేయచ్చు. ఇక్కడ బక్రీద్ ఆప్షనల్ హాలీడే కాబట్టి ఉద్యోగులకు తమ సంస్థలు సెలవు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఆ వీకెండ్ ని రచ్చ చేసేయచ్చు. మరి.. నెక్ట్స్ వీకెండ్ ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? మీ ప్లాన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి