iDreamPost

UPI, యూట్యూబ్ ఫీచర్లతో.. Nokia నుంచి 4G ఫీచర్ ఫోన్లు.. తక్కువ ధరకే

Nokia 235, Nokia 220: లో బడ్జెట్ కస్టమర్ల కోసం నోకియా 4జీ ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. యూపీఐ, యూట్యూబ్ వంటి ఫీచర్లతో కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది.

Nokia 235, Nokia 220: లో బడ్జెట్ కస్టమర్ల కోసం నోకియా 4జీ ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. యూపీఐ, యూట్యూబ్ వంటి ఫీచర్లతో కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది.

UPI, యూట్యూబ్ ఫీచర్లతో.. Nokia నుంచి 4G ఫీచర్ ఫోన్లు.. తక్కువ ధరకే

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ఫీచర్ ఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువ. మొబైల్ తయారీ కంపెనీలు సైతం స్మార్ట్ ఫోన్ల తయారీకే మొగ్గు చూపుతున్నాయి. ఫీచర్ ఫోన్ల కంటే స్మార్ట్ ఫోన్ తో ఉపయోగాలు ఎక్కువగా ఉండడంతో వాటికి ఆదరణ పెరిగింది. లేటెస్ట్ ఫీచర్లు ఉండడం, బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు లభిస్తుండడంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా సరికొత్త ఫీచర్ ఫోన్లను ప్రవేశపెట్టింది. యూపీఐ, యూట్యూబ్ వంటి పీచర్లతో మూడు ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది.

ఒకప్పుడు నోకియా ఫోన్లకు ఎంత డిమాండ్ ఉండేదో వేరే చెప్పక్కర్లేదు. దాదాపు అందరి చేతుల్లో నోకియా ఫీచర్ ఫోన్లే దర్శనమిచ్చేవి. ఇప్పుడు మళ్లీ ఫీచర్ పోన్లను తీసుకొచ్చింది నోకియా. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతో పాటు నోకియా 235 4జీ , నోకియా 220 4జీ పేరిట మొత్తం మూడు ఫీచర్ ఫోన్లనూ తీసుకొచ్చింది. యూట్యూబ్‌, యూపీఐ ఫీచర్లతో ఈ ఫోన్లు వస్తుండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నోకియా 3210 ఫోన్‌లో 1450ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. దీంతో 9:30 గంటల పాటు టాక్‌ టైం వస్తుందని కంపెనీ తెలిపింది.

స్నేక్‌ గేమ్‌, 2ఎంపీ కెమెరా, ఫ్లాష్‌ టార్చ్‌ సదుపాయం కలిగి ఉంటుంది. యూపీఐ ఆప్షన్ ఉండడంతో స్మార్ట్ మాదిరిగానే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్ లైన్ పేమెంట్ చేయొచ్చు. యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌, న్యూస్‌, క్రికెట్‌ స్కోర్‌, 2048 గేమ్‌తో సహా 8 యాప్స్‌ ఇచ్చారు. దీని ధర రూ.3,999గా కంపెనీ నిర్ణయించింది. నోకియా 235 4జీ ఫీచర్ ఫోన్ లో 2.8 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే, 2 ఎంపీ కెమెరా అందించారు. దీని ధర రూ.3,749గా ఉంది. ఇక నోకియా 220 4జీ ధర రూ.3,249గా నిర్ణయించింది. ఈ ఫోన్‌ టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌తో వస్తోంది. లో బడ్జెట్ లో క్రేజీ ఫీచర్స్ తో ఫీచర్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ ఫోన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి