iDreamPost
android-app
ios-app

టూ వీలర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జియో.. గ్లోబల్ మార్కెట్టే టార్గెట్‌గా!

Jio 4g Device For 2 wheeler-JioThings Launched Smart Digital Cluster, Smart Module For 2 Wheelers Along With MediaTek: పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన రిలయన్స్ జియో.. తాజాగా 2 వీలర్ మార్కెట్లో కూడా అడుగుపెట్టింది. ప్రపంచ స్థాయిలో మార్కెట్ ని శాసించేలా సరికొత్త స్ట్రాటజీతో అడుగులు వేస్తోంది.

Jio 4g Device For 2 wheeler-JioThings Launched Smart Digital Cluster, Smart Module For 2 Wheelers Along With MediaTek: పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన రిలయన్స్ జియో.. తాజాగా 2 వీలర్ మార్కెట్లో కూడా అడుగుపెట్టింది. ప్రపంచ స్థాయిలో మార్కెట్ ని శాసించేలా సరికొత్త స్ట్రాటజీతో అడుగులు వేస్తోంది.

టూ వీలర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జియో.. గ్లోబల్ మార్కెట్టే టార్గెట్‌గా!

ఇప్పటికే రిలయన్స్ గ్రూప్ కింద రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ హెల్త్, రిలయన్స్ పవర్, జియో, జియో ప్లాట్ ఫామ్స్ వంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. తాజాగా రిలయన్స్ కంపెనీ టూ వీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. లీడింగ్ సెమీ కండక్టర్ కంపెనీ మీడియా టెక్, జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో థింగ్స్ కంపెనీ.. టూ వీలర్ కోసం డిజైన్ చేసిన మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్ ని ప్రారంభించినట్లు ప్రకటించింది. టూ వీలర్ మార్కెట్లో తమ ఉనికిని బలపరుచుకోవడం, ఎలక్ట్రిక్ వాహనాల ల్యాండ్ స్కేప్ లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా మీడియా టెక్, జియో థింగ్స్ కంపెనీలు పని చేస్తాయని అన్నారు. స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ అనేది ఏవీఎన్ఐఓఎస్ మీద ఆధారపడి పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టం. రియల్ టైం డేటా అనలిటిక్స్, కస్టమైజేబుల్ ఇంటర్ఫేసెస్, వాయిస్ రికగ్నైజేషన్ వంటిని ఆఫర్ చేస్తుంది.

ఈ క్లస్టర్ ఎలక్ట్రిక్ వాహనాలకు వాహన కంట్రోలర్లతో నిరంతరాయ అనుసంధానాన్ని, ఐఓటీ అనేబుల్డ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి వాటిని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో జియో ఆటోమోటివ్ యాప్ సూట్ కూడా ఉంటుంది. ఈ సూట్ లో జియో వాయిస్ అసిస్టెంట్, జియో సావన్, జియో పేజెస్, జియో ఎక్స్ ప్లోరర్ వంటివి 2 వీలర్ వాహనదారులకు మరింత మెరుగైన అనుభూతిని ఇస్తాయి. ఈ బిజినెస్ కలయిక గురించి మీడియా టెక్ కంపెనీ ఇంటెలిజెంట్ డివైజెస్ బిజినెస్ గ్రూప్ కార్పొరేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ జెర్రీ యు మాట్లాడుతూ.. మీడియా టెక్ ద్వారా ఆధారితమైన టూ వీలర్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ మీద జియో థింగ్స్ తో కలవడం వల్ల ఐఓటీ, ఆటోమోటివ్ ఈ రెండు సెక్టార్స్ లో వినూత్న ఆవిష్కరణలకు మా నిబద్ధతను బలపరుస్తుంది అన్నారు. ఈ క్లస్టర్ విజన్ తో కూడిన 2 వీలర్ స్మార్ట్ డ్యాష్ బోర్డులు వస్తాయని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న 2 వీలర్ ఈవీ మార్కెట్లో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (ఓఈఎంస్)ని పోటీతత్వంతో అందించడం ద్వారా.. ఓఎస్ లెవల్ లో మీడియా టెక్ లేటెస్ట్ టెక్నాలజీస్ ని, సాఫ్ట్ వేర్ ఫీచర్స్ ని ముందస్తుగా అందుబాటులోకి వస్తుందని అన్నారు. 

ఇక మీడియా టెక్ కంపెనీ ఐఓటీ బిజినెస్ యూనిట్ జనరల్ మేనేజర్ సీకే వాంగ్ మాట్లాడుతూ.. టూ వీలర్ మార్కెట్ కోసం భారతదేశంలో తయారు చేయబడిన స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్ పై జియో థింగ్స్ తో కలిసి మీడియా టెక్ కంపెనీ దేశంలో సమర్థవంతంగా ఎదగాలని.. ఆవిష్కరణలను అందించాలన్న నిబద్ధత కలిగి ఉందని అన్నారు. దీంతో మీడియా టెక్ అడ్వాన్స్డ్ చిప్ సెట్ టెక్నాలజీ, జియో థింగ్స్ విజనరీ డిజిటల్ సొల్యూషన్స్.. అంతర్జాతీయ 2 వీలర్ మార్కెట్ కి నిత్యం మారుతున్న అవసరాలను అందుకునేలా తర్వాతి జనరేషన్ స్మార్ట్ క్లస్టర్స్ ని అందించగలవని అన్నారు. జియో థింగ్స్, మీడియా టెక్ కలయికలో తాము రైడర్ అనుభవాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నామని.. అంతర్జాతీయ స్థాయిలో మొబిలిటీ ఇన్నోవేషన్ వేవ్ ని నడపడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి