iDreamPost

Aavesham OTT: OTT లో మరో భాషలోకి .. ఫహద్ ఫాజిల్ బ్లాక్ బస్టర్ మూవీ

  • Published Jun 18, 2024 | 11:03 AMUpdated Jun 18, 2024 | 11:03 AM

ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో మొదట కొన్ని సినిమాలను ఒరిజినల్ భాషలో మాత్రమే రిలీజ్ చేసినా ఆ తర్వాత మిగిలిన భాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో మొదట కొన్ని సినిమాలను ఒరిజినల్ భాషలో మాత్రమే రిలీజ్ చేసినా ఆ తర్వాత మిగిలిన భాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.

  • Published Jun 18, 2024 | 11:03 AMUpdated Jun 18, 2024 | 11:03 AM
Aavesham OTT: OTT లో మరో భాషలోకి .. ఫహద్ ఫాజిల్  బ్లాక్ బస్టర్ మూవీ

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన సినిమా ఆవేశం.. థియేటర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఏప్రిల్ 11న ఈ సినిమా కేవలం మలయాళంలో మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. కేవలం ఒక భాషలో రిలీజ్ అయినా కూడా.. ఈ సినిమా రూ.160కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఓటీటీ లో అన్ని భాషలలోను స్ట్రీమింగ్ చేస్తారు. కానీ ఈ సినిమా మాత్రం ఓటీటీ లో కూడా కేవలం మలయాళంలో మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మరో భాషలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దానికి సంబందించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో మొదట కొన్ని సినిమాలను ఒరిజినల్ భాషలో మాత్రమే రిలీజ్ చేసినా ఆ తర్వాత మిగిలిన భాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫహద్ నటించిన ఆవేశం మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. ఆవేశం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో మే 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, థియేటర్ లో ఒరిజినల్ భాషలో రిలీజ్ అయినా కానీ.. ఓటీటీ లో మాత్రం దాదాపు అన్ని భాషలలోను సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఆవేశం సినిమా మాత్రం కేవలం మళయాళంలోనే ఓటీటీ లో కూడా రిలీజ్ అయింది. అయినా కూడా ఈ సినిమాకు ఓటీటీ లో మంచి రెస్పాన్స్ లభించింది. అయితే సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయినా ఇన్ని రోజులకు ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేయనున్నారట మేకర్స్.

Aavesham

ఆవేశం సినిమాను డబ్బింగ్ వెర్షన్స్ లోకి కూడా తీసుకుని రావాలని.. ప్రైమ్ వీడియోకు నెటిజన్లు డిమాండ్ చేస్తూ వచ్చారట. దీనితో ప్రైమ్ వీడియో తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసురానుంది. జూన్ 21 నుంచి ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే తెలుగు ఆడియో వెర్షన్ విషయంలో మాత్రం ఇంకా ఏ క్లారిటీ లేదు. మరి తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తే మాత్రం.. వ్యూవర్ షిప్ ఇంకాస్త పెరుగుతుందని చెప్పి తీరాలి. మరి ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూసేసి ఉంటారు, ఇక డబ్బింగ్ వెర్షన్స్ కూడా త్వరలో రిలీజ్ అయితే మాత్రం ఇంకోసారి చూసిన పర్లేదనిపిస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి