హైదరాబాద్ మాదాపూర్ లో డ్రగ్స్ కలకం రేపిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన, షాకింగ్ విషయాలు వెల్లడించారు. అందులో టాలీవుడ్ హీరో నవదీప్ పేరును కూడా వెల్లడించారు. దీంతో టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ఇదే క్రమంలో మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తెలంగాణ హైకోర్టు నవదీప్ కు ఊరట ఇచ్చింది. ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది.
గురువారం మాదాపూర్ డ్రగ్స్ కేసుకి సంబంధించి సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో టాలీవుడ్ లో ఉన్న వారి పేర్లు సైతం బయటకు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కూడా ఉన్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. అంతేకాక నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్ చేశామని కమిషనర్ వివరించారు.
కాగా.. ఈ డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై హీరో నవదీప్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. పోలీసులు చెబుతున్న నవదీప్ తాను కాదని ఆయన తెలిపారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నానని నవదీప్ తెలిపాడు. అంతేకాక తనపేరు రావడంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో నవదీప్ హైకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టులో నవదీప్ కు ఊరట లభించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతడికి తెలంగాణ హైకోర్టు బిగ్ రీలీప్ ను ఇచ్చింది. నవదీప్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించింది కోర్టు. మరి.. నవదీప్ కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ‘చంద్రముఖి 2’ విషయంలో డైరెక్టర్ రిస్క్ తీసుకుంటున్నారా?
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు వీరాభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థఇయేటర్ల వద్ద పెద్ద హంగామా చేస్తుంటారు. పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి.. పాలభిషేకం చేస్తుంటారు. అభిమానులు అంటే రక్తం పంచుకోకుండా పుట్టిన గొప్ప ఆత్మీయులు అంటారు హీరోలు. తమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడతారని.. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అంటారు. అలాంటి అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా స్వయంగా వెళ్లి ఓదారుస్తుంటారు. తాజాగా తన అభిమాన […]