iDreamPost

‘చంద్రముఖి 2’ విషయంలో డైరెక్టర్ రిస్క్ తీసుకుంటున్నారా?

  • Author singhj Published - 03:19 PM, Fri - 15 September 23
  • Author singhj Published - 03:19 PM, Fri - 15 September 23
‘చంద్రముఖి 2’ విషయంలో డైరెక్టర్ రిస్క్ తీసుకుంటున్నారా?

కోలీవుడ్ తలైవా రజినీకాంత్ తన సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో ఆటుపోట్లు చూశారు. అప్పట్లో ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘బాషా’, ‘నరసింహ’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి నంబర్ వన్ హీరోగా నిలిచారు రజినీ. కానీ ఆ తర్వాత ‘బాబా’ సినిమాతో ఆయన ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎంతో ఇష్టపడి చేసిన ఈ మూవీ ఫ్లాప్ కావడంతో సినిమాతో బిజినెస్​లో ఉన్నవారికి భారీగా నష్టాలు వచ్చాయి. రజినీ తన రెమ్యూనరేషన్​ను కూడా తిరిగి ఇచ్చేశారని అంటుంటారు. దీంతో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన రజినీకి ‘చంద్రముఖి’ సినిమా రూపంలో భారీ ఊరట లభించింది. ఈ మూవీ అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ సూపర్​ హిట్​గా నిలిచింది. ఇందులో రజినీ మార్క్ కామెడీ, స్టైలిష్ యాక్టింగ్​కు తోడు జ్యోతిక అద్భుతమైన నటన, మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకున్నాయి.

‘చంద్రముఖి’ తర్వాత రజినీకాంత్ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఈ మూవీకి సీక్వెల్​గా తెరకెక్కిన ‘చంద్రముఖి 2’లో మాత్రం తలైవా నటించలేదు. సీక్వెల్​లో రజినీ ప్లేసులో డ్యాన్స్ మాస్టర్ రాఘవా లారెన్స్ యాక్ట్ చేశారు. అలాగే చంద్రముఖిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ భయపెట్టేందుకు సిద్ధమైపోయారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్​కు ఆడియెన్స్​ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఊహించినంత రేంజ్​లో బజ్ మాత్రం రాలేదు. ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చంద్రముఖి 2’ రన్ టైమ్ కూడా లాక్ అయ్యింది. ఈ మూవీ నిడివి ఏకంగా 170 నిమిషాలట (2 గంటల 50 నిమిషాలు). ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

‘చంద్రముఖి 2’ రన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇంత నిడివి ఉన్న సినిమాలు ఆడియెన్స్​ను ఆకట్టుకోవాలంటే అందుకు తగిన స్టోరీతో గ్రిప్పింగ్ స్క్రీన్​ ప్లే, విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి. దాదాపుగా మూడు గంటలు సీట్లలో ప్రేక్షకులను కట్టిపడేయాలి. అయితే ఈ మూవీ డైరెక్టర్​ పి.వాసుతో పాటు చిత్ర బృందం ఈ విషయంలో పూర్తిగా విశ్వాసంతో ఉందట. కానీ దర్శకుడు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారని.. ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుందని నెటిజన్స్ అంటున్నారు. డైరెక్టర్ పి.వాసు అప్పట్లో వెంకేటష్​తో తీసిన ‘నాగవల్లి’ని ప్రేక్షకులు బోర్​గా ఫీలయ్యారని.. ఇప్పుడు కూడా అలాగే తీసుంటే మాత్రం కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: తల్లి సురేఖపై శ్రీజ పోస్ట్ వైరల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి