iDreamPost

నిమ్మగడ్డ పరిధి మేరకే చేశారా..?

నిమ్మగడ్డ పరిధి మేరకే చేశారా..?

దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదాస్పదమయ్యారు. ప్రభుత్వంతో ప్రతి విషయంలోను ఘర్షణకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో మొదలు పెట్టి… పదవీ విరమణ చేసే ముందటి వరకు ప్రతీ విషయంలో ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నారు.

ప్రతీ చిన్న విషయానికి కోర్టుకు..!

నిమ్మగడ్డ తన ప్రతీ అడుగు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన్నట్లుగానే వేశారన్న అపకీర్తి మూట కట్టుకున్నారు. తన చర్యల ద్వారా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రభుత్వ యంత్రాంగం జడవలేదు. చేసిన వన్నీ చేసేసి తాపీగా పదవీ విరమణ చేసే రోజు.. స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని.. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు.

ప్రివిలేజ్ కమిటీ అంటే భయపడుతున్నారా..?

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి పై నిమ్మగడ్డ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రులిద్దరూ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన కమిటీ నిమ్మగడ్డ వ్యక్తి గతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల నేపథ్యంలోనే నిమ్మగడ్డ ట్యూన్ మారినట్లు తెలుస్తోంది.

పోతూ పోతూ కూడా మెలికలు..

నిమ్మగడ్డ పోతూ పోతూ కూడా మెలికలు పెట్టడం మానలేదు. మిగిలిన జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని చెప్పారు. గత నోటిఫికేషన్ సమయంలో అయిన ఏకగ్రీవాలు చెల్లుతాయని హైకోర్టు తీర్పు చెప్పినా తన మొండి తీరు మార్చుకోకపోవడం నిమ్మగడ్డకే చెల్లింది.

Also Read : ఆత్మనూన్యతాభావనలో నిమ్మగడ్డ.. పదవీ విరమణ సమయంలో సుద్దులు

మళ్లీ కోర్టుకు వెళతారట..!

తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటు అడిగానని, అది నిరాకరించడంవల్ల టీ కప్పులో తుఫానుగా మారిందని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు. ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని.. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందని, ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదని తన చర్యలను సమర్థించుకునేలా మాట్లాడారు.

తాను ఎన్నికల కమిషనర్ గా తన విధులను మాత్రమే నిర్వర్తించానని, ఆ విధుల నిర్వహణకు ఆటంకం కలిగినప్పుడు వాటిని న్యాయస్థానాలద్వారా అడ్డుతొలగించానని చెప్పుకున్నారు. అలాగే ఇంకా కొన్ని వివాదాలు ఇటు రాష్ట్ర హైకోర్టులోనూ, అటు సుప్రీం కోర్టులోనూ ఉన్నాయని, అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయన్న విశ్వాసం ఉందన్నారు.

తన అనుభవాలతో మార్పులు అంట..

తన పదవీకాలంలో తన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల చట్టాల్లో, విధివిధానాల్లో మార్పులు సూచిస్తూ ఓ నివేదిక రాష్ట్ర గవర్నర్ కు అందజేశానని, దాని కాపీ ఒకటి నూతన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి అందజేస్తానని నిమ్మగడ్డ తెలిపారు.

చివరిగా తాను పదవీవిరమణ తర్వాత ఏ రాజకీయపార్టీలోను చేరబోనని, రాజకీయాలకు తాను దూరంగా ఉంటానన్నారు. అయితే ఆయన కొద్ది రోజుల తర్వాత ఏదొక పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు.

Also Read : కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి